Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. ఆదివారం రాశిఫలాలు..

చాలామంది కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా తమ జాతకాలు, రాశిఫలాలను (Rasi Phalalu) అనుసరిస్తుంటారు.

Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. ఆదివారం రాశిఫలాలు..
Horoscope Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 07, 2022 | 6:51 AM

Today Horoscope: జీవితంలో మనం ప్రతిరోజూ ముందు, వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. అందుకే.. చాలామంది కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా తమ జాతకాలు, రాశిఫలాలను (Rasi Phalalu) అనుసరిస్తుంటారు. ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకొని పనులు చేపడతారు. ఆగస్టు 7 (ఆదివారం) న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషం: ఈ రాశి వారు ముఖ్య విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని ఇబ్బందులెదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే ఫలితం ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టిసారించాలి.

వృషభం: ఈ రాశి వారికి శుభకాలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధు, మిత్రులతో విందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

మిథునం: కొన్ని ఇబ్బందులు ఎదురైనా చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. కొన్ని పరిణామాలు మీలో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

కర్కాటకం: ముఖ్యమైన పనుల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబం నుంచి సహకారం లభిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

సింహం: చేపట్టిన పనుల్లో శ్రమ అధికమైనప్పటికీ మంచి ఫలితాలను అందుకుంటారు. సుధీర్ఘకాలం నాటి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది.

కన్య: ఈ రాశి వారికి శుభకాలం. కీలక పనుల్లో పురోగతి లభిస్తుంది. ఒక కీలక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సకాలంలో ఆర్థిక సాయం అందుతుంది.

తుల: ఈ రాశి వారు చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన కొనుగోళ్లు చేపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం: కీలక పనుల్లో ఆశించిన ఫలితం వస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

ధనుస్సు: ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి.

మకరం: చేపట్టిన పనుల్లో ద్వంద్వ వైఖరి నష్టాలను కలిగించే అవకాశం ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. బంధుమిత్రులతో విబేధాలు వచ్చే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశి వారికి శుభకాలం. ముందస్తు ప్రణాళికలతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

మీనం: ఈ రాశివారి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక కీలక వ్యవహారంలో తోటివారి నుంచి సాయం అందుతుంది. శుభకార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి