వరదల ఎఫెక్ట్.. రోడ్డుపైనే నిద్రపోయిన ఖడ్గమృగం..
అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో అనేక గ్రామాలు నీటమునిగాయి. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రజలతో..

అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో అనేక గ్రామాలు నీటమునిగాయి. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రజలతో పాటు.. అనేక పశువులు, పక్షులు కూడా వరదల దాటికి మృతి చెందాయి. ఇక పలు ఉద్యానవనాలు కూడా నీటమునిగిపోయాయి. ఈ క్రమంలో అందులో ఉన్న జంతువులు మృత్యువాతపడ్డాయి.
గోలఘాట్‌లోని కాజీరంగా జాతీయ ఉద్యానవనంలో.. వరదల దాటికి 98 జంతువులు మృతిచెందినట్లు ప్రభుత్వమే పేర్కొంది. అయితే ఈ ఉద్యానవనం నుంచి ఓ ఖడ్గమృగం అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చింది. బాగోరీ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బందర్ ధుబీ సమీపంలోని నేషనల్ హైవేపై ప్రత్యక్షమైంది. అంతేకాదు.. అలసిపోయి.. రోడ్డు పక్కనే నిద్రపోయింది. అది చూసిన వాహనదారులు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది.. దానిని తీవ్ర ప్రయత్నాలు చేసి తిరిగి ఉద్యానవనంలోకి పంపించేందుకు ప్రయత్నించారు. అయితే అది తీవ్ర అస్వస్థతకు గురై ఉండటంతో దానికి అక్కడే చికిత్స అందించారు. ఆ తర్వాత దానిని రెస్క్యూ కేంద్రానికి పంపారు. అయితే పోలీసులు ఈ ప్రాంతంలో వెళ్తున్న వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని.. రోడ్డు పక్కల జంతువులు ఉండే అవకాశం ఉందని తెలిపారు.



