Allu Arjun: ఆ తప్పు రిపీట్ అవ్వదంటున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ సుదీర్ఘ విరామాలకు స్వస్తి పలికి, ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదలయ్యేలా "మెగా ప్లానింగ్" మొదలుపెట్టారు. ప్రస్తుతం అట్లీ, లోకేష్ కనకరాజ్ సినిమాలను ఏకకాలంలో పూర్తి చేయనున్నారు. త్రివిక్రమ్, పుష్ప 3 కూడా లైన్‌లో ఉన్నాయి. 2027-2028 నాటికి నాలుగు సినిమాలు విడుదల చేయాలని బన్నీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యూహం ఆయన అభిమానులకు పండగే.
తెలియకుండానే సినిమా సినిమాకి భారీ గ్యాప్ తీసుకుంటున్నారు అల్లు అర్జున్. గత ఆరేళ్లలో బన్నీ నుంచి వచ్చింది పుష్ప ఫ్రాంచైజీ మాత్రమే. అందుకే మెగా ప్లానింగ్ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా ఏడాదికి ఇకపై కనీసం ఓ సినిమా వచ్చేలా ఆపరేషన్ షురూ చేసారు. అందులో భాగంగానే అందర్నీ లైన్‌లో పెట్టారు. మరి బన్నీ ప్లానేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ ఇవ్వకుండానే పుష్ప ఫ్రాంచైజీతో ఇండియన్ సినిమా రికార్డులతో చెడుగుడు ఆడుకున్నారు. రికార్డుల వరకు బానే ఉన్నా.. గ్యాప్ మాత్రం భారీగా వచ్చేసింది. 2021 నుంచి 2025 మధ్యలో బన్నీ నుంచి పుష్ప మాత్రమే. అందుకే ఈ గ్యాప్ రిపీట్ అవ్వకుండా కేర్ తీసుకుంటున్నారీయన. అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం 4 సినిమాలున్నాయి. పైగా అన్నీ కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్సే. అట్లీతో చేస్తున్న AA22 కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలైంది.. నెల రోజుల పాటు ఈ షూట్ జరగనుంది. ఇక మార్చి నుంచి లోకేష్‌తో సినిమా మొదలుపెట్టనున్నారు బన్నీ. ఓవైపు అట్లీ.. మరోవైపు లోకేష్ కనకరాజ్ సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు ఐకాన్ స్టార్. బడ్జెట్ పరంగా, క్యాస్టింగ్ పరంగా లోకేష్ కంటే అట్లీ సినిమా భారీగా ఉండబోతుంది.. 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక లోకేష్ కనకరాజ్ సినిమాను కేవలం 120 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీ. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. AA22 కంటే ముందే AA23 రానుంది. 2027లో రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీ. అట్లీ, లోకేష్ తర్వాత త్రివిక్రమ్ లైన్‌లో ఉన్నారు. కార్తికేయ స్వామి నేపథ్యంలో రానున్న మైథలాజికల్ సినిమా ఇది. 2027లో ఇది సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పుష్ప 3 కూడా ఉందని సుకుమార్ మళ్లీ మళ్లీ నొక్కి చెప్తున్నారు. ఈ లెక్కన 2027, 2028లో తనవైపు నుంచి కనీసం 4 సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రెండ్ మారింది..స్పెషల్ సాంగ్ ట్రెండూ మారింది
చేజేతులా సినిమాలను నాశనం చేసుకుంటున్నారా
హిట్టు కోసం హిస్టరీ తవ్వుతున్న యాక్షన్ హీరో
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్‌కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

