అక్రమాయుధాల తయారీ ముఠా గుట్టురట్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం..

అక్రమంగా ఆయుధాలను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు యూపీ పోలీసులు. గత కొద్దిరోజులుగా క్రిమినల్స్‌ చేతుల్లో ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..

అక్రమాయుధాల తయారీ ముఠా గుట్టురట్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం..
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 4:36 AM

అక్రమంగా ఆయుధాలను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు యూపీ పోలీసులు. గత కొద్దిరోజులుగా క్రిమినల్స్‌ చేతుల్లో ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానికంగా కొన్ని ముఠాలు ఆయుధాలను తయారు చేస్తూ.. వాటిని ఢిల్లీ, హర్యానా, యూపీలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అక్రమాయుధాల తయారీ ముఠాల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో ముజఫ్ఫర్‌ నగర్‌ జిల్లా జౌలా గ్రామంలో అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యలను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 75 ఆయుధాలను స్వాధీనంచ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు.. మరో 45 అసంపూర్తిగా తయారు చేసిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా పెద్ద ఎత్తున ఆయుధా సామాగ్రి, మందుగుండు సామాగ్రిని సీజ్ చేశారు. అంతేకాదు.. 45 దేశీ పిస్టళ్లు,ఆరు మస్కట్లు, ఒక తుపాకీ, 23 బాంబులు, మరో 24 పూర్తికానీ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. క్యాట్రేజీలతో పాటు.. ఆయుధాలకు ఉపయోగించే పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆయుధాలను తయారు చేసేందుకు కైరాన్‌, మీరట్‌, ఖటౌలీ, బుద్ధన తదితర ప్రాంతాల్లో సామగ్రిని కోనగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ తయారు చేసిన ఆయుధాలను.. స్థానిక క్రిమినల్స్‌కు, పొరుగు జిల్లాల్లో విక్రయిస్తున్నారని.. హర్యానాలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ ఆయుధాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.