Director Krishnavamshi : ఆ సినిమా హిట్టయ్యిందంటే నేను చేసిన ఆ పనివల్లే.. జగపతి బాబు లైఫ్ మారిపోయింది.. డైరెక్టర్ కృష్ణవంశీ..
దర్శకుడు కృష్ణవంశీ ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. మురారి, రంగమార్తాండ, అంతఃపురం, శశిరేఖ పరిణయం వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తాజాగా హీరో జగపతి బాబు యాక్టింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటులు తమ భావోద్వేగాలను పండించడానికి మద్యం వాడకంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

తెలుగు చిత్రపరిశ్రమలో డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం అంతగా సినిమాలను రూపొందిచడం లేదు. కానీ గతంలో పలు ఇంటర్వ్యూలలో తన సినీప్రయాణం, సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు వ్యక్తిగత విషయాల కంటే వృత్తిపరమైన అవుట్‌పుటే ముఖ్యమని ఆయన తన అన్నారు. క్రియేషన్ అనేది కేవలం ఉద్యోగం కాదని, అది వ్యక్తి నైపుణ్యం, జ్ఞానం, వ్యక్తిత్వం, దయ, మానవతా దృక్పథం నుంచి వెలువడుతుందని తెలిపారు. గతంలో కోట శ్రీనివాసరావుతో జరిగిన సంఘటనపై కృష్ణవంశీ వివరణ ఇచ్చారు. ఆ సమయంలో తాను కొంచెం తొందరపడ్డానని, కోట శ్రీనివాసరావు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. తన మాటలను ఆయన అపార్థం చేసుకున్నారని, తాను నటులు లేరు అనలేదని, తక్కువ మంది నటులు ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది రావాలి అని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
అంతఃపురం చిత్రంలో జగపతి బాబు ప్రదర్శించిన అద్భుత నటన గురించి కృష్ణవంశీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఐదు రోజుల పాటు ప్రతీ రెండు మూడు గంటలకు జగపతి బాబుకు టకీలా ఇచ్చానని, దాని వల్ల ఆయనలోని సంకోచాలు, ముసుగులు తొలగిపోయి పాత్రలో లీనమవగలిగారని వెల్లడించారు. నటుడిని భావోద్వేగంగా పండించేలా చూడటం దర్శకుడి బాధ్యత అని, అది కేవలం అనుకరణ కాదని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
రవితేజను ముందుగా ఈ పాత్రకు అనుకున్నప్పటికీ, జగపతి బాబు అల్టిమేట్‌గా నటించారని, ఆయన పాత్రలో తన విజన్‌ను తాను చూడగలిగానని అన్నారు. చివరిగా, గొప్ప నటుడు అంటే జనాలను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయగలిగినవాడేనని, అది తాగినా తాగకపోయినా అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
