Vijayashanthi: ఆ హీరో తండ్రి నాకు దేవుడు.. ఆయన వల్లే లేడీ సూపర్ స్టార్ అయ్యా.. విజయశాంతి ఎమోషనల్..
నటి విజయశాంతి.. తెలుగు సినిమా ప్రపంచంలో ప్రత్యేకమైన ముద్ర వేసిన హీరోయిన్. అప్పట్లో స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి జోడిగా అత్యధిక చిత్రాల్లో నటించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే.

ప్రముఖ నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ప్రపంచంలో రాములమ్మ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆమెదే. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. కృష్ణ, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించింది. ప్రతిఘటన, ఓసేయ్ రాములమ్మ, అడవి చుక్క వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మాస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినీపరిశ్రమలో తనకు దివంగత దర్శకుడు టి. కృష్ణ తనకు దేవుడు అని .. ఆయన తన కెరీర్ మలుపు తిప్పారని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన పట్ల తనకున్న కృతజ్ఞతను, అభిమానాన్ని వెల్లడించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి గ్లామర్ పాత్రలు సాధారణంగా లభిస్తాయని, అయితే కళాకారులలోని నటనను బయటకు తీసుకురాగల దర్శకులు చాలా అరుదుగా ఉంటారని ఆమె అన్నారు. అటువంటి దర్శకులలో టి. కృష్ణ అగ్రగణ్యులని, ఆయనకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
దర్శకుడు టి. కృష్ణ తనలోని నటనా సామర్థ్యాన్ని నేటి భారతం వంటి చిత్రాలతో వెలికితీశారని విజయశాంతి గుర్తుచేసుకున్నారు. “విజయశాంతి కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటించగలదు” అనే పేరు రావడానికి పూర్తి క్రెడిట్ ఆయనకే చెందుతుందని ఆమె స్పష్టం చేశారు. ఆయన తన అన్ని చిత్రాలలో తననే నటిగా ఎంచుకోవడానికి కారణం, విప్లవాత్మకమైన కథలకు, పాత్రలకు తాను సరిపోతానని, తన హావభావాలు అద్భుతంగా ఉంటాయని ఆయన నమ్మడమేనని తెలిపారు. ఆయన తనను “శాంతమ్మ” అని ఆప్యాయంగా పిలిచేవారని, తన ప్రతి సినిమాకు తనే ఉండాలని కోరుకునేవారని విజయశాంతి వివరించారు. ఒక సందర్భంలో, తాను వరుసగా ఆయన చిత్రాలలో నటించడం వల్ల ఆయనకు బోర్ కొట్టదా అని ప్రశ్నించగా, “లేదు శాంతమ్మ, నువ్వే చేయాలి, నువ్వే బాగా చేస్తున్నావు” అని చెప్పేవారని విజయశాంతి పంచుకున్నారు. ప్రతిఘటన చిత్రం సమయంలో అయితే తనకు డేట్లు కుదరకపోయినా, “నువ్వు చేయకపోతే నేను సినిమా చేయను” అని టి. కృష్ణ పట్టుబట్టారని, నిర్మాతలందరినీ ఒప్పించి ఒక నెల రోజుల సమయం తనకు కేటాయించారని ఆమె వెల్లడించారు. తాను చేయలేనని భావించిన ఆ పాత్రను దేవుడు కూడా తనతోనే చేయించారని ఆమె అన్నారు. ఈ చిత్రం తనకు సూపర్‌స్టార్ అనే బిరుదును తెచ్చిపెట్టిందని, తన కెరీర్‌లో అదొక కీలక మలుపు అని విజయశాంతి స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
ప్రతిఘటన సమయంలో తాను చిన్న వయసులో ఉండటం వల్ల లెక్చరర్ పాత్రకు సరిపోదని చాలా మంది విమర్శించారని, దర్శకుడు తప్పు చేస్తున్నారని అన్నారని విజయశాంతి తెలిపారు. అయితే, టి. కృష్ణ తనపై పూర్తి నమ్మకంతో, సరైన గెటప్‌తో, మేకప్‌తో పెద్దమ్మాయిలా కనిపించేలా చేశారని, తాను కూడా ఆ విమర్శలను ఒక సవాలుగా స్వీకరించి అద్భుతంగా నటించానని చెప్పారు. టి. కృష్ణ పట్టుదల, తన సవాలు స్వీకరణ కలసి ఆ సినిమాను అద్భుత విజయం చేశాయని, అది తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆమె పేర్కొన్నారు. గ్లామర్‌కు అతీతంగా తనలోని నటనను గుర్తించి వెలికితీసిన ఘనత ఆయనదేనని, ఆ తర్వాతే ఇతర గొప్ప దర్శకులు తనతో పని చేశారని విజయశాంతి తెలిపారు. తన కెరీర్‌లో ఏడు సినిమాల వరకు టి. కృష్ణతో చేశానని, ఇన్ని అద్భుతమైన పాత్రలు, విజయాలు దక్కడం తన అదృష్టమని ఆమె అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

Vijayashanti, Gopichand
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
