మరికొన్ని గంటల్లో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సక్సెస్ మీట్.. నయనతార వస్తుందా? క్లారిటీ ఇదిగో
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు మూవీ ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ ను పురస్కరించుని ఆదివారం (జనవరి 25) సాయంత్రం మూవీ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ జోరు తగ్గడం లేదు. రిలీజై దాదాపు రెండు వారాలు గడుస్తున్నా ఈ మూవీకి హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక శనివారం (జనవరి 24) నాడు ఏకంగా లక్ష టికెట్లు బుక్‌మైషోలో అమ్ముడుపోయాయి. ఆపై గణతంత్ర దినోత్సవం స్పెషల్ ఉంది కాబట్టి ఈ రెండు రోజులు కూడా థియేటర్స్ ఫుల్ కానున్నాయి. దీంతో మన శంకరవరప్రసాద్ గారు మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన నేపథ్యంలో మూవీ యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోనుంది. ఆదివారం (జనవరి 25)న సాయంత్రం 5గంటలకు ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సక్సెస్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. హైదరాబాద్‌లో ఎక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ.. పార్క్ హయత్‌లో జరగవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.
కాగా ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సక్సెస్ మీట్ లో హీరోయిన్ నయన తార కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మూవీ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయన్ చిరంజీవి సినిమా విషయంలో మాత్రం తన పట్టు వీడింది. డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ప్రమోషన్స్ వీడియోలు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడ మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ మీట్ వేదికగా నయనతార మాట్లాడనుందని సమాచారం.
The entire team of #ManaShankaraVaraPrasadGaru is coming together to celebrate this HISTORICAL SUCCESS ❤️🔥#MegaSankranthiBlockbusterMSG ALL-TIME INDUSTRY HIT in regional cinema Celebrations TODAY From 5 PM onwards 💥💥💥#MSG IN CINEMAS NOW 🫶🫶🫶 pic.twitter.com/OluJ87gNlj
— Shine Screens (@Shine_Screens) January 25, 2026
మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. వీరితో పాటు ఈ సినిమాలు పలువురు స్టార్స్ నటించారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో రోల్ లో అదరగొట్టగా క్యాథరీన్ థెరీసా, అభినవ్ గోమఠం, జరీనా వాహబ్, సచిన్ ఖేడ్కర్, హర్షవర్దన్ ఇలా చాలామంది ఫేమస్ యాక్టర్స్ ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భీమ్స్ స్వరాలు సమకూర్చారు.
Megastar firing at the box office 💥 Whistles firing from every corner 🔥
Rampage second weekend everywhere for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥❤️🔥❤️🔥
Audiences are flocking to theatres again and again to celebrate Megastar @KChiruTweets on the big screen ❤️… pic.twitter.com/JKVLv4B8CL
— Shine Screens (@Shine_Screens) January 25, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




