మణిపూర్‌: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్న ఏడీజీపీ

మణిపూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. పోలీసు శాఖలో కీలక పదవిలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనకు..

మణిపూర్‌: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్న ఏడీజీపీ
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 18, 2020 | 7:22 PM

మణిపూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. పోలీసు శాఖలో కీలక పదవిలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి పోలీసు శాఖ రంగంలోకి దర్యాప్తు కొనసాగిస్తోంది. పూర్తి వివరాలు పరిశీలించగా…

మణిపూర్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీపీ) అరవింద్ కుమార్ శనివారం తన నివాసంలో సర్వీస్‌ రివాల్వర్‌తో తనను తాను కాల్చుకున్నాడు. వెంటనే అక్కడున్న మిగతా సిబ్బంది, స్థానికులు గమనించి అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే అరవింద్‌ కుమార్‌ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్దారించారు. కాగా, అరవింద్‌ ఎందుకు షూట్‌ చేసుకున్నాడనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడు అరవింద్‌ కుమార్‌ ఇంఫాల్‌లోని రెండో మణిపూర్ రైఫిల్ కాంప్లెక్స్‌లో నిర్మించిన ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివసిస్తున్నట్లు తెలిసింది. అరవింద్‌ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా ఇంఫాల్‌ పోలీసు అధికారులు వెల్లడించారు.