AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా గోల్డ్ ఖజానా గురించి తెలుసా..?

Gold Capital of India: భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో ఒకటి. అయితే దేశానికి ఒక బంగారు రాజధాని కూడా ఉందని మీకు తెలుసా..? అక్కడ అడుగుపెడితే ప్రతి వీధిలోనూ పసిడి కాంతులు కనిపిస్తాయి. వేలాది మంది కళాకారులు, కోట్లాది రూపాయల వ్యాపారం.. జరిగే ఆ నగరం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా గోల్డ్ ఖజానా గురించి తెలుసా..?
Gold Capital Of India
Krishna S
|

Updated on: Jan 24, 2026 | 12:08 PM

Share

ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షలా మారుతున్నా.. మన దేశంలో పసిడికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. భారతీయులకు బంగారం అనేది కేవలం ఒక మెటల్ కాదు సెంటిమెంట్. ఆపదకాలంలో ఆదుకునే ఆర్థికభరోసా. సాధారణంగా మహారాష్ట్రలోని జల్గావ్ బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి అని మనకు తెలుసు. కానీ అధికారికంగా ఒక నగరాన్ని భారతదేశ బంగారు రాజధాని అని పిలుస్తారని మీకు తెలుసా..? ఆ నగరం మరేదో కాదు.. కేరళలోని త్రిసూర్.

త్రిసూర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?

కేరళలోని త్రిసూర్ నగరం కేవలం ఆధ్యాత్మికతకే కాదు అపరంజి వ్యాపారానికి కూడా నిలయం. దేశంలోనే అతిపెద్ద బంగారు ఆభరణాల టోకు, రిటైల్ కేంద్రంగా త్రిసూర్ వెలుగొందుతోంది. ఈ నగరాన్ని గోల్డ్ క్యాపిటల్ అని పిలవడానికి ప్రధాన కారణాలు ఇవే..

భారీ తయారీ కేంద్రాలు: ఇక్కడ వేలాది ఆభరణాల తయారీ యూనిట్లు, వర్క్‌షాప్‌లు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని మెజారిటీ షోరూమ్‌లకు ఇక్కడి నుంచే ఆభరణాలు సరఫరా అవుతాయి.

నైపుణ్యం కలిగిన కళాకారులు: త్రిసూర్‌లో లక్షలాది మంది స్వర్ణకారులు, డిజైనర్లు నివసిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న వారి నైపుణ్యం దేశవిదేశాల్లో గుర్తింపు పొందింది.

దక్షిణ భారతానికి ప్రధాన కేంద్రం: కేరళతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక పెద్ద జ్యువెలరీ షోరూమ్‌లు త్రిసూర్ నుంచే తమ స్టాక్‌ను దిగుమతి చేసుకుంటాయి.

శతాబ్ద కాలం నాటి అనుబంధం

త్రిసూర్‌కు బంగారంతో ఉన్న సంబంధం నిన్న మొన్నటిది కాదు. దీనికి దాదాపు ఒక శతాబ్దం కంటే ఎక్కువ చరిత్ర ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలోనే ఇక్కడి స్వర్ణకారులు విభిన్నమైన ఆభరణాల తయారీని వృత్తిగా స్వీకరించారు. సహకార బ్యాంకులు, చిట్ ఫండ్స్, ఆర్థిక సంస్థల పెరుగుదలతో ఇక్కడ బంగారు వ్యాపారం ఒక వ్యవస్థీకృత పరిశ్రమగా మారింది. కేరళలోని ఆలయాలకు బంగారు ఆభరణాలు సమర్పించే సంప్రదాయం కూడా ఈ నగరం బంగారు కేంద్రంగా మారడానికి ఒక కారణం.

ఆధునిక ఆభరణాల హబ్

నేడు త్రిసూర్ కేవలం సాంప్రదాయ ఆభరణాలకే పరిమితం కాలేదు. ఆధునిక డిజైన్లు, మెషీన్ కటింగ్ ఆభరణాలు, వివాహ వేడుకలకు ప్రత్యేకంగా చేసే టెంపుల్ జ్యువెలరీ ఇక్కడ ఎంతో ప్రత్యేకం. భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో ఒకటిగా ఉండటంలో త్రిసూర్ వంటి నగరాల పాత్ర ఎంతో కీలకమైనది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..
ఇవి మీ కలల్లోకి వస్తే త్వరలోనే మీరు లక్షాధికారి అవుతారట..!
ఇవి మీ కలల్లోకి వస్తే త్వరలోనే మీరు లక్షాధికారి అవుతారట..!