హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వ్యక్తి మెడలోని బంగారు గొలుసును ఆసుపత్రి సిబ్బందే కొట్టేశారని కథనం వెల్లడించింది. ఈ అమానవీయ చర్యపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసుపత్రిలోని అత్యవసర విభాగాన్ని పరిశీలించారు.