ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యేలిద్దరు నా వైపే…అశోక్ గెహ్లాట్
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్న ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యేలిద్దరు మళ్ళీ సీఎం అశోక్ గెహ్లాట్ సర్కార్ కి తమ సపోర్ట్ ప్రకటించారు. భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు శాసన సభ్యులు తమ రాష్ట్ర నేతలతో..
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్న ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యేలిద్దరు మళ్ళీ సీఎం అశోక్ గెహ్లాట్ సర్కార్ కి తమ సపోర్ట్ ప్రకటించారు. భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు శాసన సభ్యులు తమ రాష్ట్ర నేతలతో సమావేశమై.. తమ డిమాండ్లపై చర్చించారని, తిరిగి తనకు మద్దతు ప్రకటించారని గెహ్లాట్ వెల్లడించారు. తమను బలవంతంగా ఓ లగ్జరీ హోటల్లో బందీలుగా ఉంచారంటూ ఈ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది. దీంతో రెబెల్ నేత, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ రాజకీయ ఎపిసోడ్ లో ఈ ఇద్దరి వైనం ఆసక్తికరమైన సైడ్ లైట్ గా నిలిచింది. తనవర్గం ఎమ్మెల్యేలను పైలట్ ఈ హోటల్లోనే ఉంచారని వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలు తమ మద్దతును గెహ్లాట్ ప్రభుత్వానికి ప్రకటించకపోతే ఆయన సర్కార్ కొంతవరకు ఇబ్బందుల్లో పడేదని తెలుస్తోంది.
ఇలా ఉండగా..గెహ్లాట్ ప్రభుత్వం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోవలసివస్తే. మన ఎమ్మెల్యేలంతా తటస్థంగా ఉండాలంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ మహేష్ భాయ్ వాసవ వారికి లేఖలు రాశారు.