Surya kumar Yadav : గంభీర్ కాదు..ఆ వ్యక్తి కాళ్ల మీద పడ్డ సూర్యకుమార్..కారణం తెలిస్తే వావ్ అనాల్సిందే
Surya kumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో తన బ్యాట్‌తోనే కాదు, తన ప్రవర్తనతోనూ అందరి మనసు గెలుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి, 82 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన సూర్య.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక అరుదైన దృశ్యానికి వేదికయ్యాడు.

Surya kumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో తన బ్యాట్‌తోనే కాదు, తన ప్రవర్తనతోనూ అందరి మనసు గెలుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి, 82 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన సూర్య.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక అరుదైన దృశ్యానికి వేదికయ్యాడు. దాదాపు 15 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న సంతోషంలో, సూర్య చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయ్‌పూర్ టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. గత కొన్ని నెలలుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరిసారిగా 2024 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌పై హైదరాబాదులో హాఫ్ సెంచరీ చేసిన సూర్య, మళ్లీ ఇన్నాళ్లకు అంటే సుమారు 15 నెలల తర్వాత తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సూర్య, జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం జరిగిన ఒక సంఘటన నెటిజన్ల మనసును హత్తుకుంది.
జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్ గౌతమ్ గంభీర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన సూర్యకుమార్.. టీమిండియా థ్రో-డౌన్ స్పెషలిస్ట్ రఘు కనిపించగానే ఒక్కసారిగా ఆయన కాళ్లపై పడి నమస్కరించాడు. ఇది చూసి రఘు కూడా ఆశ్చర్యపోయి వెంటనే సూర్యను పైకి లేపి హత్తుకున్నారు. అసలు సూర్య అంతటి గౌరవాన్ని రఘుకు ఎందుకు ఇచ్చాడంటే.. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న సమయంలో నెట్స్ లో గంటల తరబడి సూర్యకు ప్రాక్టీస్ చేయించింది రఘునే. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ, బ్యాటర్లను మ్యాచ్‌కు సిద్ధం చేయడంలో రఘు దిట్ట.
రఘు టీమిండియాలో గత పదేళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు కూడా రఘు సేవలను బహిరంగంగానే కొనియాడారు. “మేము మ్యాచ్‌ల్లో రాణించడానికి కారణం నెట్స్‌లో రఘు మాపై చూపించే కఠినత్వమే” అని కోహ్లీ ఒకానొక సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా తన రీఎంట్రీలో రఘు పాత్ర ఎంత ఉందో ఈ చిన్న చేష్ట ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాడు. కేవలం కొన్ని వారాల క్రితమే తిలక్ వర్మ కూడా సెంచరీ చేసిన తర్వాత రఘు కాళ్లు మొక్కిన విషయం తెలిసిందే.
Best video on the internet : India vs New Zealand, 2nd T20I ❤️
– Suryakumar Yadav touches Raghu's feet, whose role is crucial in his comeback.– Captain Surya hugs Ishan Kishan– Hardik Pandya hugs Ishan Kishan– Abhishek Sharma appreciates Ishan#indvsnzt20 #INDvsNZ #indvnz pic.twitter.com/NR0mPUznBo
— Manoranjitham (@Manoranjit22150) January 24, 2026
ఈ వీడియోలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఒకరినొకరు హత్తుకోవడం.. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ కలిసి ఇషాన్‌ను అభినందించడం కూడా చూడవచ్చు. భారత జట్టులో ఉన్న ఈ సమిష్టితత్వం, పెద్దల పట్ల ఉన్న గౌరవం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. “గురువు అంటే గంభీర్ మాత్రమే కాదు.. తెర వెనుక కష్టపడే రఘు లాంటి వారు కూడా గొప్ప గురువులే” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సూర్య బ్యాట్ తోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ నంబర్ వన్ అని నిరూపించుకున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
