AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలన్‌పూర్-అబు రోడ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, ముగ్గురికి సీరియస్

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరోహిలోని పాలన్‌పూర్-అబు రోడ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఐషర్ ట్రక్కు ఇన్నోవా కారును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది, దీంతో సంఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది. గుజరాత్‌లోని అమీర్‌గఢ్ - ఇక్బాల్‌గఢ్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

పాలన్‌పూర్-అబు రోడ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, ముగ్గురికి సీరియస్
Sirohi Road Accident
Balaraju Goud
|

Updated on: Jan 25, 2026 | 9:23 AM

Share

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరోహిలోని పాలన్‌పూర్-అబు రోడ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఐషర్ ట్రక్కు ఇన్నోవా కారును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది, దీంతో సంఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది. గుజరాత్‌లోని అమీర్‌గఢ్ – ఇక్బాల్‌గఢ్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదం ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. గుజరాత్ పోలీసులు మృతులందరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం అమీర్‌గఢ్ ఆసుపత్రికి తరలించారు. శివ్‌గంజ్‌కు చెందిన ముగ్గురు, పింద్వారా, అబు రోడ్‌కు చెందిన ఒక్కొక్కరు ఈ ప్రమాదంలో మరణించినట్లు భావిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకువచ్చిన ట్రక్కు.. ఇన్నోవా కారును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. గాయపడిన ముగ్గరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం తరువాత, సంఘటన స్థలంలో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ ఘటనతో రహదారిపై భారీ ట్రాఫిక్ స్తంభించింది. కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. ఫలితంగా దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

అమీర్‌గఢ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం తర్వాత నిందితుడు ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిర్లక్ష్యం, రాంగ్ రూట్ లో ట్రక్కు నడపడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకుని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ ఇంట్లో ఈ శుభ సంకేతాలు కనిపిస్తున్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం..
మీ ఇంట్లో ఈ శుభ సంకేతాలు కనిపిస్తున్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం..
ఉద్యోగాల జాతర.. DIETల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్‌
ఉద్యోగాల జాతర.. DIETల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్‌
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ