కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..!
Suppressing Anger: కోపాన్ని దాచుకోవడం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు వైద్య నిపుణులు. కోపం వచ్చినప్పుడు ప్రదర్శించడమే కొన్ని సమయాల్లో ఉత్తమమని చెబుతున్నారు. అయితే, కోపాన్ని మనం దాచుకోవడం వల్ల శరీరంలో కలిగే మార్పులు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయనేదానిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి మనుషికి కోపం అనేది సహజ భావోద్వేగం. చాలా మంది కోపాన్ని వెంటనే వ్యక్తం చేస్తున్నారు. కొందరు చిన్న విషయాలకే తీవ్ర కోపానికి గురవుతుంటారు. మరికొందరు ఎలాంటి పరిస్థితులోనైనా ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా శాంతంగా ఉంటారు. కానీ, కోపం అనే ఆ భావాన్ని ఇతరులతో చెప్పకుండా కూడా దాచుకుని ఉండటం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు వైద్య నిపుణులు. కోపం వచ్చినప్పుడు ప్రదర్శించడమే కొన్ని సమయాల్లో ఉత్తమమని చెబుతున్నారు. అయితే, కోపాన్ని మనం దాచుకోవడం వల్ల శరీరంలో కలిగే మార్పులు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయనేదానిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కోపం దాచితే ఏమవుతుంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఒత్తిడి, మానసిక ఆరోగ్యం నివేదికల ప్రకారం.. కోపాన్ని అణిచివేయడం వల్ల శరీరంలో ఒత్తిడి హర్మోన్ కార్డిసాల్ ఎక్కువ కాలం చురుగ్గా ఉంటుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. కోపాన్ని అణుచుకోవడం అంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం కాదు.. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఇది చివరికి శారీరక శారీరక అనారోగ్యానికి దారితీస్తుందని మానసిక వైద్యులు చెబుతున్నారు.
కాపాన్ని ప్రదర్శిస్తే.. ప్రమాదం తగ్గుతుందా?
కోపాన్ని వ్యక్తపర్చడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కానీ, దూకుడుగా కాదని అంటున్నారు. మీ భావాలను ప్రశాంతంగా వ్యక్తపర్చడం ఒత్తిడిని తగ్గిస్తుంది. సంబంధాలను మెరుగుపరుస్తుంది. కోపాన్ని అణచివేయడం కంటే నియంత్రించడం ఉత్తమమైన చర్య అిన చెబుతున్నారు. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోండి. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపర్చండి. క్రమం తప్పకుండా వ్యాయమం, ధ్యానం చేయాలని సూచిస్తున్నారు. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలని అంటున్నారు.
చివరగా.. కోపాన్ని పూర్తిగా దాచడం ఆరోగ్యానికి మంచిదని మిత్రులు, కుటుంబ సభ్యులు లేదా సమాజం చెప్పినా కూడా.. వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్న నిజం ఏమిటంటే.. కోపాన్ని దాచితే కోపం శరీరంలో మరింత ఇబ్బంది, ఒత్తిడి, అనారోగ్యాలు తీసుకొస్తుంది. కాబట్టే, భావాలను ఆరోగ్యకరంగా గుర్తించి, సంభాషణగా మార్చడం చాలా అవసరం.
