గుండె ఆరోగ్యానికి పాల కూర బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకు అంటారో తెల్సా?
25 January 2026
TV9 Telugu
TV9 Telugu
పాలకూర పోషకాల గని. ఇందులో విటమిన్ ఎ, సి, కె, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
TV9 Telugu
రక్తం గడ్డకట్టడంలో, ఎముకలను దృఢంగా చేయడంలో కూడా పాలకూర మనకు సహాయపడుతుంది. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి
TV9 Telugu
ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను కాపాడడంలో కూడా ఇవి మనకు దోహదపడతాయి
TV9 Telugu
కనుక పాలకూరను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. పాలకూర గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
TV9 Telugu
దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు గుండెపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. పాలకూరలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
క్యాలరీలు తక్కువగా ఉంటాయి, దీనిలో థైలాకోయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గొచ్చు
TV9 Telugu
పాలకూరను ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. అలాగే పాలకూరను వండేటప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువగా లేకుండా చూసుకోవాలి
TV9 Telugu
అధిక ఉష్ణోగ్రత మీద పాలకూరను ఉడికించడం వల్ల పోషకాలు నశిస్తాయి. పాలకూరను స్మూతీలతో కలిపి అల్పాహారంగా తీసుకోవడం మంచిది. పాలకూర ఆకులను సలాడ్ లలో ఉపయోగించడం వల్ల దానిలో ఉండే పోషకాలు పెరుగుతాయి