బీపీ అదుపు చేయాలంటే ఉప్పు మాత్రమే తగ్గిస్తే సరిపోదు.. ఇది కూడా అవసరమే!
25 January 2026
TV9 Telugu
TV9 Telugu
అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య నేటి కాలంలో రోజురోజుకీ పెరుగుతుంది. మారిన జీవనశైలే ఇందుకు ప్రధాన కారణం
TV9 Telugu
దీంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. రక్తపోటు అనగానే ముందుగా అందరూ ఉప్పును తక్కువగా తీసుకోమని సూచిస్తూ ఉంటారు
TV9 Telugu
రక్తపోటుతో బాధపడే వారు రోజూ 6 గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు
TV9 Telugu
అయితే ఉప్పును తక్కువగా తీసుకున్నంత మాత్రాన రక్తపోటు తగ్గదని పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్లే రక్తపోటు అదుపులో ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి
సాధారణంగా మనకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు తక్కువ ఉప్పును తీసుకోవాలని సలహా ఇస్తారు. అయితే ఆహారంలో భాగంగా అరటిపండు, బ్రోకలీ వంటి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి
TV9 Telugu
వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకున్నప్పడు ఉప్పును తగ్గించినప్పటి కంటే కూడా రక్తపోటు స్థాయిలు ఎక్కువ తగ్గుతాయట
TV9 Telugu
పొటాషియం, సోడియం రెండూ కూడా ఎలక్ట్రోలైట్లు. నరాల సిగ్నలింగ్, కండరాల సంకోచాలు, ద్రవ సమతుల్యత వంటి శారీరక విధులను ఇవి నిర్వర్తిస్తాయి. ఫలితంగా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది