Duologue NXT with Rhea Singha: మిస్ యూనివర్స్ ఇండియా టూ బాలీవుడ్! స్టార్ ఇన్ ది మేకింగ్..
డ్యూయోలాగ్ NXTలో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తన ప్రయాణం గురించి పంచుకున్నారు. అందాల పోటీల నుంచి బాలీవుడ్‌లోకి ఆమె ఎదగడానికి పడిన అవిశ్రాంత కృషిని వివరించారు. బరుణ్ దాస్ హోస్ట్‌గా, మహిళల విజయాలను ఆవిష్కరించే ఈ షోలో రియా, తన జీవితానుభవాలు, భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్న డ్యూయోలాగ్ NXT టాక్ షో మహిళలు సాధించిన విజయాలు, వారి జీవిత ప్రయాణాలను అద్భుతంగా ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. TV9 నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ బరుణ్ దాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న డ్యూయోలాగ్ NXTలో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా పాల్గొన్నారు. అందాల సుందరి నుంచి బాలీవుడ్‌లోకి ఆమె ప్రయాణం ఎలా సాగిందో ఈ టాక్ షోలో వివరించారు.
రాడికో ప్రదర్శించే డ్యూయోలాగ్ NXT తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ బరుణ్ దాస్ రియా సింఘా ప్రయాణంలో స్ఫూర్తిదాయకమైన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అందాల పోటీల నుంచి బాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు అవిశ్రాంత కృషి, భవిష్యత్తు కోసం ధైర్యవంతమైన నిర్ణయాల గురించి ఆమె మాట్లాడారు.
మిస్ యూనివర్స్ ఇండియాను గెలుచుకోవడం ఒక పెద్ద ఘనత అయినప్పటికీ, ప్రపంచ వేదిక తనకు ఎంత ఎదిగినా ఒదిగే ఉండే గుణం నేర్పిందని రియా అన్నారు. హోస్ట్ బరుణ్ దాస్ ధైర్యసాహసాలపై విస్తృత ప్రతిబింబంలో భాగంగా రియా ప్రయాణాన్ని సందర్భోచితంగా వివరించారు. డ్యూయోలాగ్ NXT గురించి రియా మాట్లాడుతూ.. “డ్యూయోలాగ్‌లో పాల్గొనడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన వారి ఎసిసోడ్‌లు చూశాను. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ షోలో భాగం కావడం గర్వంగా ఉంది.
అయితే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తుంది. రియా సింఘా కేవలం లైమ్‌లైట్‌లోకి రావడం మాత్రమే కాదు.. ఆమె రానున్న కాలంలో పెద్ద స్థాయికి చేరుకోవడానికి వేదికను సిద్ధం చేస్తోంది. రియా సింఘా పాల్గొన డ్యూయోలాగ్ NXT పూర్తి ఎపిసోడ్‌ను న్యూస్ 9లో అక్టోబర్ 01, 2025 రాత్రి 10:30 గంటలకు చూడొచ్చు. డ్యూయోలాగ్ యూట్యూబ్ ఛానెల్ (@Duologuewithbarundas), న్యూస్ 9 ప్లస్ యాప్‌లో ప్రసారం అవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




