శాంతి పునరుధ్దరణ, రష్యాలో రాజ్ నాథ్ సింగ్ పిలుపు

తమ భూభాగంలో ఒక్క అంగుళాన్నయినా వదులుకునేది లేదని చైనా ప్రకటించిన అనంతరం భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఉభయ దేశాల  మధ్య శాంతిని పునరుధ్దరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

శాంతి పునరుధ్దరణ, రష్యాలో రాజ్ నాథ్ సింగ్ పిలుపు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 05, 2020 | 1:36 PM

తమ భూభాగంలో ఒక్క అంగుళాన్నయినా వదులుకునేది లేదని చైనా ప్రకటించిన అనంతరం భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఉభయ దేశాల  మధ్య శాంతిని పునరుధ్దరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య పరమైన చర్చలు, సంప్రదింపులు జరగాలని, వీటి ద్వారానే సరిహద్దు సమస్య పరిష్కారమవుతుందన్నారు. బోర్డర్లో సేనల ఉపసంహరణలు జరగాలి.. ఏ దేశ సైనికులు ఆయా ప్రాంతాలవరకు వెనక్కి వెళ్ళాలి, ఉభయదేశాల్లో ఎవరు మొండి వైఖరి ప్రదర్శించినా అది ఉద్రిక్తతలకు దారితీస్తుందేతప్ప, సమస్య పరిష్కారానికి దోహదపడబోదు అని ఆయన అన్నారు. జటిలమైన సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చు అని రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.