Restaurant Overcharged Waterbottle: రూ.20 వాటర్ బాటిల్‌కు రూ.164 బిల్ వేసిన రెస్టారెంట్, ఐదేళ్లు పోరాటం గెలిచిన రోహిత్
మల్టిప్లెక్స్ థియేటర్స్, రెస్టారెంట్లలో ఏదైనా కొంటే ఎమ్మార్ఫీ కంటే ఎక్కువ వసూలు చేస్తే.. కొంత మంది తిట్టుకుంటారు.. మరికొందరు ఇదేమిటని ప్రశ్నిస్తారు.. అయితే అతి తక్కువ మంది మాత్రమే ఇది దారుణమైన మోసం అంటూ పోరాడతారు. ఇంత జరుగుతున్నా...
Restaurant Overcharged Waterbottle:మల్టిప్లెక్స్ థియేటర్స్, రెస్టారెంట్లలో ఏదైనా కొంటే ఎమ్మార్ఫీ కంటే ఎక్కువ వసూలు చేస్తే.. కొంత మంది తిట్టుకుంటారు.. మరికొందరు ఇదేమిటని ప్రశ్నిస్తారు.. అయితే అతి తక్కువ మంది మాత్రమే ఇది దారుణమైన మోసం అంటూ పోరాడతారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకు ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తుంటారు. వినియోగదారులు ఆ షాప్ యాజమాన్యాన్ని నిలదీస్తే మేము ఇంతే.. ఇష్టమైతే కొనుక్కో లేకపోతే లేదు.. అంటూ సమాధానం చెబుతారు.. అలా మీకు దిక్కుకున్న చోట చెప్పుకోమంటే ఓ వ్యక్తి ఆ రెస్టారెంట్ యాజమాన్యంపై ఏకంగా ఐదేళ్లు పోరాటం చేశారు. చివరికి గెలిచారు. ఇది గుజరాత్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రోహిత్ పాటిల్ (67) అక్టోబరు 2015లో ఎస్‌జీ జాతీయ రహదారిపై ఓ రెస్టారెంట్ కు వెళ్లి తన స్నేహితులతో కలిసి భోజనం చేశాడు. అలాగే, ఓ వాటర్ బాటిల్ కొనుకున్నాడు. అయితే, నీళ్ల సీసాకు వేసిన బిల్లు చూసి రోహిత్ అవాక్కయ్యారు. రూ.20 వాటర్ బాటిల్ కి బిల్లులో రూ.164 ఛార్జ్ చేయడంతో హోటల్ సిబ్బందికి ఇదేమిటి అని నిలదీశారు. వాటర్ బాటిల్ ధర రూ.150గా , అదనంగా సర్వీస్ ఛార్జెస్, ఇతర పన్నులు రూ.14 వేశారు. తమ వద్ద ఇదే ధర .. అంటూ బిల్లు మొత్తం వసూలు చేశారు.
దీంతో రోహిత్ ఈ అన్యాయం పై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఒక వాటర్ బాటిల్ ధర ను ఎమ్మార్పీ కంటే ఎనిమిది రెట్లు వసూలు చేశారంటూ వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేశారు. తాను చెల్లించిన బిల్లు ఆ హోటల్ లో కొన్న బాటిల్ ను ఆధారంగా చూపిస్తూ.. 2015 లో ఫిర్యాదు చేశారు. తనకు లక్ష రూపాయలను పరిహారంగా ఇప్పించాలని కోరారు.
ఫిర్యాదుని స్వీకరించిన కోర్టు హోటల్ యాజమాన్యానికి నోటీసులు పంపించింది. వాటర్ బాటిల్ రూ. 164 బిల్లు సరియైంది అంటూ తన వాదన కోర్టులో వినిపించింది. తమ హోటల్ సర్వీస్ ధరకు తగ్గట్లుగానే ఉంటుందని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న అహ్మదాబాద్ కోర్టు రెండు రోజుల క్రితం తుది తీర్పు వెలువరించింది. హోటల్ యాజమాన్యం ఎమ్మార్ఫీ ధర కంటే ఎక్కువ వసూలు చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. కేసు పెట్టిన రోహిత్ పై హోటల్ సిబ్బంది వేధింపులకు గురించేయడం అన్యాయమని స్పష్టం చేసింది. హోటల్ యాజమాన్యం బాధితుడు రోహిత్ కు రూ. 2,500 చెల్లించాలని ఆదేశించింది. ఇతర ఖర్చుల నిమిత్తం మరో రూ.3,000 ఫైన్ వేసింది. దీంతో మొత్తం రూ.5,500 బాధితుడికి పరిహారంగా నెలరోజుల్లో ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కన్జ్యూమర్ కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రోహిత్ హర్షం వ్యక్తం చేశాడు. తనకు వచ్చే పరిహారం మొత్తాన్ని ఏదైనా స్వచ్ఛంద సంస్థకు అందజేస్తానని చెప్పారు.
Also Read: కొణిదెలవారింట వైభవంగా సంక్రాంతి సంబరాలు.ఈసారి కొత్తఅల్లుడే కాదు..అనుకోని అతిథి కూడా