Dress Code: రెస్టారెంట్‌ నిర్వాహకుల నిర్వాకం.. చీర కట్టుకుని వచ్చిందని మహిళకు నో ఎంట్రీ..

దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్‌లో ఉన్న రెస్టారెంట్లో చీరకట్టులో వచ్చిన ఓ మహిళను రానీయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకరం రేపుతోంది.

Dress Code: రెస్టారెంట్‌ నిర్వాహకుల నిర్వాకం.. చీర కట్టుకుని వచ్చిందని మహిళకు నో ఎంట్రీ..
Denies Entry To Woman In Sa
Follow us

|

Updated on: Sep 22, 2021 | 6:19 PM

చీర మన చరిత్ర… చీర మన ఆత్మవిశ్వాసం… అంతరించిపోతోన్న చేనేతకు చీరల తయారీతో ఊపిరి పోయాలనుకుంటున్నాయి ప్రభుత్వాలు. మనదేశం భిన్న సంస్కృతుల సమ్మేళనం. ప్రతి ప్రాంతానికీ ఓ చరిత్ర ఉంటుంది. అదే గొప్పదనం చీరల్లోనూ కనిపిస్తుంది. మహిళల జీవితంలో ఓ భాగమైపోయింది. దేశవ్యాప్తంగా గుళ్లు, సైన్యంలో సైతం మహిళల ప్రవేశానికి దారులు తెరుచుకుంటున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మహిళల్ని అవమానించేలా ఓ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. చీర కట్టుతో వచ్చిన ఓ మహిళను ఓ మాల్‌లోని రెస్టారెంట్ నిర్వాహకులు అడ్డుకున్నారు. ఆమెను అనుమతించకుండా ఇబ్బంది పెట్టారు.

భారతీయ సంప్రదాయనికి నిదర్శనంగా కనిపించే చీరకట్టులో కనిపించేందుకు సిటీ అమ్మాయిలు ఈ మధ్యకాలంలో తెగ ముచ్చట పడుతున్నారు. అనకాపల్లి నుంచి అమెరికా వనిత వరకు చీరకట్టులో కనిపించేందుకు ఇష్టపడుతున్నారు. అంతే కాదు పారిస్‌లోని ఫ్యాషన్ షోల్లో సైతం చీరకట్టులోనే ర్యాంప్ వాక్‌లు చేస్తూ అదరహో అనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్‌లో ఉన్న రెస్టారెంట్లో చీరకట్టులో వచ్చిన ఓ మహిళను రానీయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకరం రేపుతోంది.

దక్షిణ ఢిల్లీలోని అన్సల్ ప్లాజా అనే మాల్‌లోని రెస్టారెంట్‌కు ఓ మహిళ వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులతోపాటు అక్కడి మహిళా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అదేమని అడిగితే తమ రెస్టారెంట్ స్మార్ట్ డ్రెస్ కోడ్‌లో మీ చీర లేదని.. అందుకే లోనికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆమె సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరికి ఆమెను మాత్రం అనుమతించలేదు.

ఈ అవమానం జరిగింది ఓ సామాన్య మహిళకు కాదు సమజంలో జరిగే అన్యాయాలను.. అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే ఓ మహిళా జర్నలిస్టుకు ఇంతటి అవమానం జరిగింది. ఈ వివరాలను అనితా చౌదరి సోషల్ మీడియాలో పెట్టారు. ఇందులో తాను ధరించిన చీర స్మార్ట్ అవుట్ ఫిట్ కాదంట అనే క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

“నిన్న నా చీర కారణంగా జరిగిన అవమానం నాకు ఇప్పటివరకు జరిగిన ఇతర అవమానాల కంటే పెద్దది, హృదయ విదారకమని అని ఆమె క్యాప్షన్‌లో హైలెట్ చేశారు.” ఆ తర్వాత ఆమె యూట్యూబ్ లోనూ తనకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోను అప్ లోడ్ చేయడంతో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది. దురదృష్టవశాత్తూ మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చీరలు స్మార్ట్ దుస్తులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అనితా చౌదరి.

ఇవి కూడా చదవండి: Liquor Shops: మద్యం షాపు యజమానులకు గుడ్‌న్యూస్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్..

Kerala High Court: కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పు.. అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి..