ఢిల్లీ హింసాకాండపై పోలీసుల నజర్.. దీప్ సిధు ఆచూకీ వెల్లడిస్తే రూ.లక్ష రివార్డు.. మరికొంత మందిపై కూడా..

Republic Day Violence - Deep Sidhu: ఢిల్లీ హింసాత్మక ఘటనలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్‌ సిధు సమాచారం అందిస్తే రూ.లక్ష...

  • Shaik Madarsaheb
  • Publish Date - 12:30 pm, Wed, 3 February 21
ఢిల్లీ హింసాకాండపై పోలీసుల నజర్.. దీప్ సిధు ఆచూకీ వెల్లడిస్తే రూ.లక్ష రివార్డు.. మరికొంత మందిపై కూడా..

Republic Day Violence – Deep Sidhu: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు దృష్టిసారించారు. జనవరి 26 కిసాన్ పరేడ్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద 44 కేసులను నమోదు చేసి, చాలా మందిని అరెస్టు చేశారు. ఎర్రకోట దగ్గర జరిగిన ఘటనలతోపాటు పలు కేసులను క్రైం బ్రాంచ్ సెల్‌కు అప్పగించి వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్‌ సిధు సమాచారం అందిస్తే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు బుధవారం ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

కాగా ఈ ఘటనల్లో దీప్‌ సిధుతోపాటు మరికొంత మందికి సంబంధముందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సిధుతోపాటు జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జాంత్ సింగ్‌పై కూడా లక్ష రివార్డును ప్రకటించారు. వారితోపాటు బుటా సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ ఆచూకీ సమాచారం అందిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. దీప్ సిధుతోపాటు నేరుగా సంబంధమున్న వారంతా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తున్నారు. దీప్ సిధు బీహార్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎర్రకోట ఘటనకు సంబంధించి పోలీసులు 12 మంది ఫొటోలను విడుదల చేశారు.

Also Read:

Rajya Sabha: వ్యవసాయ చట్టాలు, రైతు సమస్యలపై రాజ్యసభలో 15గంటల చర్చ.. ప్రభుత్వం, విపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం

Rajya Sabha: ఆ చట్టాలపై చర్చించాల్సిందే.. రాజ్యసభలో సభ్యుల డిమాండ్.. ముగ్గురు ఆప్‌ ఎంపీల సస్పెన్షన్‌