Rajya Sabha: వ్యవసాయ చట్టాలు, రైతు సమస్యలపై రాజ్యసభలో 15గంటల చర్చ.. ప్రభుత్వం, విపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం

రాజ్యసభ ప్రారంభం కాగానే రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టబట్టాయి. ఈ అంశంపై కనీసం 5 గంటల పాటు..

Rajya Sabha: వ్యవసాయ చట్టాలు, రైతు సమస్యలపై రాజ్యసభలో 15గంటల చర్చ.. ప్రభుత్వం, విపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం
Follow us

| Edited By:

Updated on: Feb 03, 2021 | 4:08 PM

Farm Laws – Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో చర్చ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సభలో రెండురోజుల నుంచి తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఈ క్రమంలో రాజ్యసభలో బుధవారం నెలకొన్న గందరగోళం అనంతరం కేంద్ర ప్రభుత్వం.. విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టబట్టాయి. ఈ అంశంపై కనీసం 5 గంటల పాటు సభలో ఏకధాటిగా చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్‌ చేయగా.. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ స్పందించారు.

ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తుందని దీనిపై 15 గంటల పాటు చర్చిద్దామని ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్‌ పక్షనేత గులాం నబీ ఆజాద్‌ తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాజ్యసభలో 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పరస్పరం అంగీకారం కుదిరిన నేపథ్యంలో ఈ అంశంపై సుధీర్ఘంగా చర్చ జరిగే అవకాశముంది.

Also Read:

Rajya Sabha: ఆ చట్టాలపై చర్చించాల్సిందే.. రాజ్యసభలో సభ్యుల డిమాండ్.. ముగ్గురు ఆప్‌ ఎంపీల సస్పెన్షన్‌

West Bengal Elections 2021: బెంగాల్‌లో కొనసాగుతున్న వలసలు.. బీజేపీలో చేరిన మరో టీఎంసీ ఎమ్మెల్యే

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్