AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghost Rides Bike: మరోసారి మనిషి మేధస్సుకు పని.. బైక్‌ నడిపిన దెయ్యం..సీసీటీవీనే సాక్ష్యం

దేవుడు, దెయ్యాలు ఉన్నాయని వాదించే వారు కొందరు.. అవన్నీ అభూతకల్పనని వాదించేవారు మరికొందరు. అసలు దేవుడు దెయ్యం వార్తలు ఎప్పుడూ సెన్సేషనల్ టాపిక్స్.. సైన్స్ కి సవాల్ చేస్తూ ప్రపంచంలో ఎన్నో..

Ghost Rides Bike: మరోసారి మనిషి మేధస్సుకు పని.. బైక్‌ నడిపిన దెయ్యం..సీసీటీవీనే సాక్ష్యం
Surya Kala
|

Updated on: Feb 03, 2021 | 1:05 PM

Share

Ghost Rides Bike: దేవుడు, దెయ్యాలు ఉన్నాయని వాదించే వారు కొందరు.. అవన్నీ అభూతకల్పనని వాదించేవారు మరికొందరు. అసలు దేవుడు దెయ్యం వార్తలు ఎప్పుడూ సెన్సేషనల్ టాపిక్స్.. సైన్స్ కి సవాల్ చేస్తూ ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి కూడా అయినప్పటికీ వీటిపై నిర్దిష్టమైన అభిప్రాయం మాత్రం లేదు . కొందరు దేవుడు ఉన్నాడన్నది నిజమైతే దెయ్యాలున్నాయన్న మాట కూడా వాస్తవమే అని అంటే.. సైన్స్ కు మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనేవారు మరికొందరు.. ఆ మరికొందరిని సవాల్ చేస్తూ మనిషి మేధస్సుకు అందనివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అటువంటిదే గుజరాత్ లో చోటు చేసుకుంది.

గుజరాత్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటిముందు పార్క్ చేసిన బైక్ దానంతటదే కదిలింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఓ వీధిలో అర్థరాత్రి ఓ ఇంటిముందు రెండు రెండు బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి.ఐతే సడెన్‌గా వీటిలో ఓ బైక్‌ సైడ్‌ స్టాంట్‌ వేసి ఉన్నప్పటికీ.. దానంతట అదే ముందుకు కదిలింది. ఇది సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. 30 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో బైక్ దానంతట అదే కదిలి ముందుకెళ్లి యూ టర్న్ తీసుకుంటూ కింద పడిపోయింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియోను అంబర్ జైదీ అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా అయ్యింది. నెటిజన్లు తమ మేధస్సుకు పదును పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఇది దయ్యం పనేనని, అదృశ్యశక్తులు ఉన్నాయని అంటున్నారు. మరికొందరు దెయ్యం గియ్యం ఏమి లేదు.. అది గ్రాఫిక్స్ వీడియో అని కొట్టి పడేస్తున్నారు.

Also Read:

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త కలర్ లో బైక్.. సూపర్బ్ .. ధర, ఫీచర్స్ తెలుసా..?

50 పైసలతో జర్నీ షురూ.. నేడు 14 కోట్ల టర్నోవర్.. సాధించిందో మహిళ