ఇది ‘రియలేనా’ ? పొరబాటా? తడబాటా?
ఒక మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ మరో బ్రాండ్ మొబైల్ ని వాడే సెలబ్రిటీలని చాలానే చూసాం. కానీ ఈసారి కాస్త కొత్తగా ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ సీఈవోనే మరో బ్రాండ్ మొబైల్ వాడుతూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రాండ్ సిఈఓలు సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల గురించి ప్రతి చిన్న విషయాలను పంచుకుంటారు. రియల్‌మీ ఇండియా సీఈఓ […]
ఒక మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ మరో బ్రాండ్ మొబైల్ ని వాడే సెలబ్రిటీలని చాలానే చూసాం. కానీ ఈసారి కాస్త కొత్తగా ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ సీఈవోనే మరో బ్రాండ్ మొబైల్ వాడుతూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రాండ్ సిఈఓలు సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల గురించి ప్రతి చిన్న విషయాలను పంచుకుంటారు. రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ శేత్ కూడా ట్విట్టర్‌లో ఇదే పని చేశారు, అయితే ఈ ట్వీట్ ను ఐఫోన్‌ను ఉపయోగించి రియల్ మీ ఫోన్ ఫీచర్స్ గురించి ట్వీట్ చేయడంతో ఓ రేంజ్ లో ట్రోల్ అయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఈ ట్వీట్ ను తొలగించారు. కానీ, పోస్ట్ డిలిట్ అయ్యేలోపే కొందరు దాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసారు.. మీ ఫోన్ లో అన్ని గొప్ప ఫీచర్స్ ఉంటే ముందు మీరే దాన్ని వాడొచ్చుగా, దాన్ని వదిలేసి ఐఫోన్ ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ ఒకరు, రియల్ మీ ఫోన్ సీఈవో అయి ఉండి ఐఫోన్ కి బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారంటూ ఇంకొందరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.