AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Recruitment 2021: పదో తరగతి పాసయ్యారా..? ఆర్బీఐలో 841 కార్యాలయ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

RBI Recruitment 2021: నిరుద్యోగులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఆర్బీఐ వివిధ కేటగిరిల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్..

RBI Recruitment 2021: పదో తరగతి పాసయ్యారా..? ఆర్బీఐలో 841 కార్యాలయ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
Subhash Goud
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Mar 03, 2021 | 9:03 AM

Share

RBI Recruitment 2021: నిరుద్యోగులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఆర్బీఐ వివిధ కేటగిరిల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, తాజాగా మరో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్దమైంది. అలాగే హైదరాబాద్‌లో కూడా ఖాళీలున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం తన వెబ్‌ సైట్‌ను సందర్శించాలని తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు 2021 మార్చి 15 చివరి తేదీ. పదో తరగతి పాస్ అయినవారు https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

ఆర్‌బీఐలో ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అభ్యర్థులు ముందుగా https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో Current Vacancies ట్యాబ్ క్లిక్ చేసి Vacancies పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Recruitment for the post of Office Attendants – 2020 పైన క్లిక్ చేయాలి. ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి. ఆ తర్వాత Online Application Form పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి. ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి. మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

కాగా, ఇవే కాకుండా ఎన్నో రంగాలలో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే చాలా రంగాల్లో ఉద్యోగాలు ఖాళీలు ఉండగా, దశల వారీగా భర్తీ చేస్తున్నాయి. ప్రతి నెలలో ఏదో ఒక రంగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడుతోంది. పదో తరగతి నుంచి డిగ్రీ, అపైన చదివిన వారికి మంచి అవకాశం కల్పిస్తున్నాయి.

ఇవి చదవండి :

FCI Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్‌

Special Tea: గంగూలీ టీ స్టాల్‌లో టీ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు.. అక్షరాల వెయ్యి రూపాయలు.. !