Rats Arrest: పోలీస్ స్టేషన్‌లో మద్యం తాగిన ఎలుకలు.. పోలీసులు ఏం చేశారంటే..
ఎలుకలు మన చుట్లూ పరిసరాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో నిలువ ఉంచుకున్న వస్తువులను పాడుచేస్తాయి. ధాన్యం బస్తాలు, వంట గదిలో ఉంచిన పదార్ధాలను లాక్కొని పోయి తింటాయి. ఎలుకల బెడద ఎక్కువగా ఉన్న వారి ఇంట్లో కొరికిన సంఘటనలు కూడా చాలనే వెలుగులోకి వచ్చాయి. ఇదంతా ఇంటి వరకూ ఉన్న పరిస్థితి. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. గతంలో ఘోరఖ్‌పూర్ రైల్వే డివిజన్ ఆఫీసులో ఎలుకల నియంత్రణ కోసం

ఎలుకలు మన చుట్లూ పరిసరాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో నిలువ ఉంచుకున్న వస్తువులను పాడుచేస్తాయి. ధాన్యం బస్తాలు, వంట గదిలో ఉంచిన పదార్ధాలను లాక్కొని పోయి తింటాయి. ఎలుకల బెడద ఎక్కువగా ఉన్న వారి ఇంట్లో కొరికిన సంఘటనలు కూడా చాలనే వెలుగులోకి వచ్చాయి. ఇదంతా ఇంటి వరకూ ఉన్న పరిస్థితి. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. గతంలో ఘోరఖ్‌పూర్ రైల్వే డివిజన్ ఆఫీసులో ఎలుకల నియంత్రణ కోసం ప్రత్యేకంగా కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను కేటాయించారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. వీటి పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పట్టుబడిన గంజాయిని కూడా ఎలుకలు టార్గెట్ చేశాయని, నిల్వ ఉంచిన బస్తాలను కొరికేస్తున్నాయని పోలీసులు తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఆ గంజాయి ప్యాకెట్లను ఐరన్ టిన్ బాక్సుల్లో భద్రపరిచారు.
మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోలీసు స్టేషన్‌లో ఒక విచిత్రమైన సంఘటనలో చోటు చేసుకుంది. ఎలుకలు పోలీసు గోదాములో నిల్వ ఉంచిన వాటిని టార్గెట్ చేశాయి. విధుల్లో పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేశాయి. అవి ప్లాస్టిక్ బాటిళ్లు కావడంతో వాటికి చిన్న రంధ్రాలు చేశాయి. ఇలా చీల్చడంతో మద్యం బయటకు వచ్చింది. దాదాపు 60 నుంచి 65 చిన్న ప్లాస్టిక్ బాటిళ్లు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు ప్రతిగా, ఒక ఎలుకను పట్టుకుని బోనులో ఉంచారు. ఈ ఒక్కటి మాత్రమే కాదని ఇంకా చాలా ఉన్నాయన్నారు.
ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్ భవనం చాలా పాతదని, సీజ్ చేసిన వస్తువులు నిల్వ ఉంచిన గోదాముల్లో ఎలుకలు ఆడుకునే ప్రదేశంగా మారిందని వివరించారు. పట్టుబడిన గంజాయిని కూడా ఎలుకలు టార్గెట్ చేశాయని అందుకే ఈ చర్యలను అడ్డుకునేందుకు పోలీసులు గంజాయి భద్రపరచడం కోసం ప్రత్యేకంగా ఐరన్ టిన్ బాక్సుల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎలుకలు, పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులకు నష్టం కలిగించడమే కాకుండా ముఖ్యమైన పత్రాలకు కూడా కొరికి వాటిని నాశనం చేస్తున్నట్లు తెలిపారు. దీనిని గుర్తించిన పోలీసులు పెద్దఎత్తున నష్టం జరగకుండా ఫైళ్లను ఎలుకలకు అందనంత ఎత్తులో భద్రపరిచేందుకు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..