‘సరికొత్త ఆవిష్కరణల వైపే యువత చూపు’.. పేటెంట్ దరఖాస్తుల పెరుగుదలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
దేశంలో పేటెంట్ దరఖాస్తుల పెరుగుదల.. యువతలో సరికొత్త ఆవిష్కరణలకు, వినూత్న ఇన్వెన్షన్లపై ఉన్న ఎనలేని కృషి, పట్టుదలకు ఉదాహరణగా ఉందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యువతలో మొదలైన ఈ తరహా అభివృద్ధి రాబోయే కాలానికి చాలా సానుకూల సంకేతంగా నిలుస్తుందన్నారు.
దేశంలో పేటెంట్ దరఖాస్తుల పెరుగుదల.. యువతలో సరికొత్త ఆవిష్కరణలకు, వినూత్న ఇన్వెన్షన్లపై ఉన్న ఎనలేని కృషి, పట్టుదలకు ఉదాహరణగా ఉందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యువతలో మొదలైన ఈ తరహా అభివృద్ధి రాబోయే కాలానికి చాలా సానుకూల సంకేతంగా నిలుస్తుందన్నారు. ఇటీవల ప్రపంచ మేధో సంపత్తి సంస్థ పేటెంట్ దరఖాస్తులపై విడుదల చేసిన నివేదికపై ప్రధాని మోదీ పైవిధంగా స్పందించారు.
2022లో భారతదేశంలోని నివాసితుల పేటెంట్ దరఖాస్తులు 31.6 శాతం పెరిగాయని, టాప్-10 ఫైలర్‌లలో మరే ఇతర దేశంతో పోల్చలేని 11 సంవత్సరాల వృద్ధి సాధించిందని ఆ నివేదిక పేర్కొంది. మరోవైపు 2022లో అత్యధికంగా పేటెంట్ ఫైలింగ్‌లు చేసిన దేశాల్లో చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ ఉన్నాయని తేల్చింది. మరోవైపు చైనాకు చెందిన అవిష్కర్తలు దాదాపుగా సగానికిపైగా గ్లోబల్ పేటెంట్ అప్లికేషన్‌లను దాఖలు చేశారు. అటు దేశం వృద్ధి రేటు వరుసగా రెండవ సంవత్సరం భారీగా పడిపోయింది. 2021లో వృద్ది రేటు 6.8 శాతం ఉండగా.. 2022లో 3.1 శాతానికి పడింది.
ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘భారతదేశంలో పేటెంట్ దరఖాస్తుల పెరుగుదల.. మన యువతలో సరికొత్త ఆవిష్కరణలపై పెరుగుతున్న ఆసక్తిని కనబరుస్తోంది. ఇది రాబోయే కాలానికి చాలా సానుకూల సంకేతం’ అని పేర్కొన్నారు.
The rise in patent applications in India demonstrate the rising innovative zeal of our youth and is a very positive sign for the times to come. https://t.co/EpEdEqlGrx
— Narendra Modi (@narendramodi) November 8, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..