Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 గంటల సేపు పెరోల్ పై వచ్చి పెళ్లి చేసుకున్న ఖైదీ.. అసలేం జరిగిందంటే

పెళ్లి అంటే ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అలాగే పెళ్లి వేడుకు త్వరలో ఉందనగానే ఇంట్లో మొత్తం సందడి మొదలవుతుంది. అన్ని పనుల్లో కుటుంబ సభ్యులు బిజీబిజీగా ఉంటారు. నెల రోజుల ముందుగానే అన్ని పనులకు ప్లాన్స్ వేసుకుంటారు.

4 గంటల సేపు పెరోల్ పై వచ్చి పెళ్లి చేసుకున్న ఖైదీ.. అసలేం జరిగిందంటే
MarriageImage Credit source: TV9 Telugu
Follow us
Aravind B

|

Updated on: Mar 26, 2023 | 12:22 PM

పెళ్లి అంటే ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అలాగే పెళ్లి వేడుకు త్వరలో ఉందనగానే ఇంట్లో మొత్తం సందడి మొదలవుతుంది. అన్ని పనుల్లో కుటుంబ సభ్యులు బిజీబిజీగా ఉంటారు. నెల రోజుల ముందుగానే అన్ని పనులకు ప్లాన్స్ వేసుకుంటారు. కానీ బిహార్ లోని జైల్లో ఉన్న ఓ యువకుడు పెళ్లి చేసుకునేందుకు నాలుగు గంటల పాటు పెరోల్ పై విడుదలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే గోపాల్ గంజ్ జిల్లాలోని రాహుల్ కుమార్ అనే వ్యక్తి హజీపూర్ లో ఇంజనీరింగ్ చదివాడు. అతనికి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయితో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గొపాల్ గంజ్ లోని ఓ గుడికి వెళ్లి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత గోపాల్ గంజ్ లోనే ఓ ఇంట్లో అద్దె తీసుకుని భార్య భర్తలుగా కలిసి ఉంటున్నారు. మార్చి 5 న ఆ అమ్మాయి ఆరోగ్యం క్షీణించింది. రాహుల్ తనను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాడు. అక్కడికి ఒక్కసారిగా పోలీసులు వచ్చి రాహుల్ అత్యాచార కేసులో అతడ్ని అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు. సుమారు 20 రోజుల నుంచి రాహుల్ జైల్లోనే ఉంటున్నాడు. అయితే తాను అత్యాచారం చేయలేదని.. ఇద్దరం ప్రేమించుకున్నామని రాహుల్ కోర్టులో తెలిపాడు. పెళ్లి చేసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరాడు. దీనికి కోర్టు అంగీకరించి సమయమివ్వడంతో పెరోల్ పై వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ జైలుకు వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..