Jio Vs Airtel: రూ. 599కే ఎయిర్ టెల్, జియోల నుంచి అదిరిపోయే పోస్ట్ పెయిడ్ ప్లాన్.. రెండింటిలో ఏది బెస్ట్?
జియో, ఎయిర్‌టెల్ తమ కస్టమర్‌లను ఆకర్షించేందుకు ప్లాన్ల ధరలను దాదాపు ఒకేలా అందిస్తున్నాయి. రెండు టెల్కోలు ఒకే ధరతో అందించే ప్లాన్లలో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒకటి. దీనిలో డేటా, కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలు, ప్రధాన పోటీదారులు జియో, ఎయిర్ టెల్. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడంలో ఈ రెండూ పోటీ పడుతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో ఆకర్షిస్తుంటాయి. ఇప్పుడు అత్యంత సరసమైన ధరలకు బెస్ట్ మొబైల్ పోస్ట్‌పెయిడ్ సర్వీసులను అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఆ ప్లాన్ల వివరాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రూ. 599కే..
జియో, ఎయిర్‌టెల్ తమ కస్టమర్‌లను ఆకర్షించేందుకు ప్లాన్ల ధరలను దాదాపు ఒకేలా అందిస్తున్నాయి. రెండు టెల్కోలు ఒకే ధరతో అందించే ప్లాన్లలో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒకటి. దీనిలో డేటా, కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
జియో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్..
రిలయన్స్ జియో రూ. 599 నెలవారీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, అన్‌లిమిటెడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తోంది. వినియోగదారులు జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌండ్ తో సహా జియో యాప్‌లకు ఉచితంగా యాక్సస్ చేయవచ్చు. ఈ ప్లాన్ జియో ట్రూ 5జీ వినియోగదారుల కోసం జియో వెల్కమ్ ఆఫర్ కింద వస్తుంది. అర్హత కలిగిన వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా యాక్సెస్‌ను అందిస్తుంది. అదనంగా, జియో టెల్కో పోస్ట్‌పెయిడ్ సర్వీసులను పొందాలంటే.. మీరు ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారవచ్చు. కొత్త వినియోగదారులు లేదా కస్టమర్‌ల కోసం ఈ ప్లాన్ 30 రోజుల ఉచిత ట్రయల్‌ను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్..
ఎయిర్‌టెల్ ఇటీవల మొబైల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల జాబితా కింద రూ. 599 ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. 75జీబీ డేటా రోల్‌ఓవర్, రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తోంది. కొత్త కనెక్షన్‌తో యూజర్లు 1 సాధారణ, 1 ఉచిత కుటుంబ యాడ్-ఆన్‌ల సిమ్ ని పొందవచ్చు. అదనంగా, ప్లాన్‌లలో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇతర బెనిఫిట్స్ ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నాయి. జియో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో 5G యాక్సెస్‌తో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది.
మరోవైపు, ఎయిర్‌టెల్ లిమిటెడ్ డేటాను అందిస్తుంది. కానీ, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వాలతో ఎక్కువ డేటాను అందిస్తున్నాయి. అలాగే, ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా, జియో యూజర్లు అదే అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ కోరుకుంటే.. ఓటీటీ బెనిఫిట్స్ కావాలంటే రూ. 699 ఫ్యామిలీ ప్లాన్‌ని పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా ఉచిత ట్రయల్‌ను అందించడమే కాకుండా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ బేసిక్ ప్లాన్ ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..