AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: సరిహద్దుల్లో ఉద్రిక్తల వేళ.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో పెళ్లి వేడుక!

భారత్-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ రాజస్థాన్‌లో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది..భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో బ్లాకౌట్‌ ప్రకటించగా సెల్‌ఫోన్‌ వెలుగుల్లో పెళ్లి చేసుకుంది ఓ జంట. సరిగ్గా తాలికట్టే సమాయానికి కరెంట్‌ పోవడంతో అక్కడున్న వారందరూ తమ ఫోన్‌లలో టార్చ్‌ లైట్స్‌ ఆన్‌ చేయడంతో వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు వరుడు.

Rajasthan: సరిహద్దుల్లో ఉద్రిక్తల వేళ.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో పెళ్లి వేడుక!
Rajasthan
Anand T
|

Updated on: May 11, 2025 | 10:51 AM

Share

ఏవైనా రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు కొన్ని కొన్ని సందర్భాల్లో సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడితో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయాలతో కొన్ని వివాహాలు కూడా ఆగిపోయిన సందర్భాలను మనం చూశాం.  అయితే ఇలాంటి పరిస్థితుల్లో జరిగే కొన్న సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అయితే తాజాగా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసే ఓ ఘటనే రాజస్తాన్‌లో వెలుగు చూసింది. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పాక్‌ దాడులను గుర్తించేందుకు కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు.

ఇలానే పాక్‌ వైమానిక దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో బ్లాకౌట్‌ ప్రకటించారు. అయితే ఆదే ప్రాంతంలో ఓ పెళ్లి వేడుక కూడా జరుగుతుంది. అయితే సరిగ్గా వరుడు తాలికట్టే సమాయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా తమ వద్ద నున్న సెల్‌ఫోన్‌లు తీసి టార్చ్‌ లైట్స్‌ ఆన్‌ చేశారు. ఇక సెల్‌ఫోన్‌ టైల్స్‌ వెలుగుల్లో వరుడు, వధువు మెడలో మూడుముళ్లు వేశాడు. ఆదే సెల్‌ఫోన్ వెలుగు మధ్య ఇద్దరు వధూవరులు ఏడడుగులు వేశారు.

అయితే, ఈ పెళ్లి తర్వాత పెళ్లి కొడుతు తరపు వారు మాట్లాడుతూ… పెళ్లి వేడుక కంటే దేశ భద్రత ముఖ్యమని..అందుకే క్లిష్ట పరిస్థితుల్లో ఆంక్షలను పాటిస్తూ, అధకారుల సూచనలకు అనుగుణంగా పెళ్లి వేడుకను పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. ఈ పెళ్లి తంతు దేశ భద్రత పట్ల దేశంలోని పౌరులకు ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..