AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఇదేం మాయ! 34 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి మళ్లీ ఇంటికి! ఎవ్వరినీ గుర్తుపట్టలేక అవస్తలు

42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎన్నాళ్లు ఎదురు చూసినా అతను తిరిగిరాలేదు. దీంతో అతను చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. కోర్టులో డెత్‌ సర్టిఫికేట్‌ కూడా పొందారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత నేను బతికే ఉన్నానంటూ వచ్చాడా..

వామ్మో.. ఇదేం మాయ! 34 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి మళ్లీ ఇంటికి! ఎవ్వరినీ గుర్తుపట్టలేక అవస్తలు
Dead Man Returns Home Alive
Srilakshmi C
|

Updated on: Jun 02, 2023 | 7:03 AM

Share

జైపూర్: 42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎన్నాళ్లు ఎదురు చూసినా అతను తిరిగిరాలేదు. దీంతో అతను చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. కోర్టులో డెత్‌ సర్టిఫికేట్‌ కూడా పొందారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత నేను బతికే ఉన్నానంటూ వచ్చాడా వ్యక్తి. ఈ విచిత్ర సంఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో మంగళవారం (మే 30) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా బన్సూర్‌ గ్రామానికి చెందిన హనుమాన్‌ సైనీ (75)కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1989లో ఢిల్లీలోని ఓ షాప్‌లో పనికి వెళ్లిన అతను కనిపించకుండా పోయాడు. ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రాకు వెళ్లిపోయారు. అక్కడ హిమాలయాల్లోని మాతా మందిరంలో పూజలు చేస్తూ సాదు జీవితాన్ని గడిపాడు. దాదాపు 34 ఏళ్ల తర్వాత 75 ఏళ్ల వయసులో ఢిల్లీకి తిరిగి వచ్చాడు. ఐతే ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా మారిపోయి ఉండటంతో తన ఇల్లు, అయిన వాళ్లను గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఓ స్నేహితుడి సహాయంతో అక్కడి నుంచి స్వగ్రామం బన్సూర్‌ చేరుకున్నారు. చాలాకాలం తర్వాత హనుమాన్‌ సైనీ ఇంటికి రావడంతో అతని కుటుంబ సభ్యులతో ఊరంతా అవాక్కయ్యారు. ఐతే హనుమాన్‌ సైనీ మాత్రం ఎవ్వరినీ గుర్తుపట్టలేక పోయాడు. చివరికి ఆయన తన భార్య దుర్గాదేవిని గుర్తుపట్టడంతో కథ సుఖాంతమైంది.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆశ్చర్యంతో ఆయన ఇంటి చుట్టూ గుమికూడారు. నిజానికి.. అతను మృతి చెంది ఉంటాడని, ఇక ఎప్పటికీ తిరిగిరాడేమోనని హనుమాన్‌ సైనీ కుమారుడు రామ్‌చంద్ర గతేడాది డెత్‌ సర్టిఫికెట్‌ కూడా తీసుకున్నాడు. తండ్రి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్నో రోజులు వెతికామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతని ఆచూకీ లభించకపోవడంతో మరణించి ఉండాటని భావించినట్లు అతను చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..