ఆ ఇద్దరూ పెట్రోల్ బాంబులు.. హర్యానా మంత్రి అనిల్ విజ్ ఫైర్

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కోనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో పలుచోట్ల విపక్ష పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు విపక్షాలపై అధికార బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా మంత్రి అనిల్ విజ్.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన రాహుల్, ప్రియాంకగాంధీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ.. లైవ్ […]

ఆ ఇద్దరూ పెట్రోల్ బాంబులు.. హర్యానా మంత్రి అనిల్ విజ్ ఫైర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 25, 2019 | 1:45 PM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కోనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో పలుచోట్ల విపక్ష పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు విపక్షాలపై అధికార బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా మంత్రి అనిల్ విజ్.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన రాహుల్, ప్రియాంకగాంధీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ.. లైవ్ పెట్రోల్ బాంబులంటూ ఆరోపించారు. వీరు ఎక్కడికి వెళ్లినా.. అక్కడ నిప్పు రాజేసి.. ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కల్గిస్తున్నారని మండిపడ్డారు.

కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ యూపీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ నేతలు.. బాధిత కుంటుంబీకులను పరామర్శిస్తున్నారు. అయితే పార్టీ నేతల పర్యటనలతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందంటూ.. పోలీసులు వీరిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాహుల్, ప్రియాంక గాంధీలను మీరట్ పోలీసులు.. నగర సరిహద్దుల్లో ఆపేశారు. ఈ క్రమంలోనే హర్యానా మంత్రి అనిల్ విజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.