రేపు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ జాగ్రత్తలు పాటించండి..!
సూర్యుడు, భూమి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. ఇక ఈ సంవత్సరం 26వ తేదిన సంపూర్ణ గ్రహణం రానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం గం.8.09ని.లకు గ్రహణం ప్రారంభం అయ్యి ఉదయం గం.11.11ని.లకు ముగుస్తుంది. మొత్తం మూడు గంటల రెండు నిమిషాల పాటు భారతదేశం అంతటా ఈ గ్రహణం కనిపించనుంది. అయితే కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాల్లో ఉండనుండగా.. మిగిలిన అన్ని […]
సూర్యుడు, భూమి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. ఇక ఈ సంవత్సరం 26వ తేదిన సంపూర్ణ గ్రహణం రానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం గం.8.09ని.లకు గ్రహణం ప్రారంభం అయ్యి ఉదయం గం.11.11ని.లకు ముగుస్తుంది. మొత్తం మూడు గంటల రెండు నిమిషాల పాటు భారతదేశం అంతటా ఈ గ్రహణం కనిపించనుంది. అయితే కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాల్లో ఉండనుండగా.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది. అలాగే శ్రీలంక, కొన్ని గల్ఫ్ దేశాలు, సుమత్రా, మలేషియా, సింగపూర్‌లోనూ గ్రహణం ఎఫెక్ట్ కనిపించనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ఆలయాలు మూసివేయనున్నారు. అయితే ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం దేవాలయం తెరచి ఉంచబడుతుంది. గ్రహణం ఎఫెక్ట్ అక్కడి దేవాలయంపై ఉండక పోగా.. ఆ రోజున అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఇదిలా ఉంటే సాధారణంగా గ్రహణాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తిని చూపుతుంటారు. అయితే ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడటం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ముఖ్యంగా సోలార్ ఫిల్టర్స్, బైనాక్యులర్ కలిగిన ప్రొజెక్టర్లు, ఎక్‌లిప్స్ గ్లాసెస్‌ను వాడాలని వారు చెబుతుంటారు. అలాగే రెగ్యులర్ సన్ గ్లాసెస్‌ను ఉపయోగించకూడదని వారు సూచిస్తుంటారు.
రాశులపై ఎఫెక్ట్: కాగా 16ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక ఈ గ్రహణం కొన్ని రాశుల వారిపై ఎఫెక్ట్ చూపనుంది. ధనస్సు రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిది. అలాగే అష్టమ స్థానంలోనూ, అర్ధాష్టమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి.. వృషభ రాశి, కన్యా రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మిగిలిన రాశుల వారిని ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదని వారు పేర్కొంటున్నారు.