ఎన్నార్సీకి మా వాళ్లలోనే వ్యతిరేకత.. అకాలీదళ్ ఎంపీ
ఎన్నార్సీ వంటి అంశాలపై ఎన్డీయేలోని మిత్ర పక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని అకాలీదళ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ తెలిపారు. తన విధానాలని ఎన్డీయే ప్రభుత్వం సరిదిద్దుకోకపోతే బీజేపీకి తమ మద్దతు విషయంలో పునరాలోచించుకోవలసి వస్తుందని ఆయన హెచ్ఛరించారు. ‘ ఎన్నార్సీకి మేం వ్యతిరేకం.. పైగా సవరించిన పౌరసత్వ చట్టం పేర్కొంటున్న లిస్టులో ముస్లిములను కూడా చేర్చాలని కోరుతున్నాం ‘ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సీఏఏకు అనుకూలంగా తాము ఓటు […]
ఎన్నార్సీ వంటి అంశాలపై ఎన్డీయేలోని మిత్ర పక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని అకాలీదళ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ తెలిపారు. తన విధానాలని ఎన్డీయే ప్రభుత్వం సరిదిద్దుకోకపోతే బీజేపీకి తమ మద్దతు విషయంలో పునరాలోచించుకోవలసి వస్తుందని ఆయన హెచ్ఛరించారు. ‘ ఎన్నార్సీకి మేం వ్యతిరేకం.. పైగా సవరించిన పౌరసత్వ చట్టం పేర్కొంటున్న లిస్టులో ముస్లిములను కూడా చేర్చాలని కోరుతున్నాం ‘ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సీఏఏకు అనుకూలంగా తాము ఓటు చేశామని, అయితే సుఖ్ బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని బాదల్ పార్టీ.. ముస్లిములను కూడా ఇందులో చేర్చాలని కోరుతోందని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ లో దాదాపు 60 వేల నుంచి 70 వేల మంది సిక్కులు తాలిబన్ల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని, అందువల్లే ఈ చట్టం విషయంలో తాము డైలమాలో ఉన్నామని ఆయన అన్నారు. సిక్కులకు తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. సహనంపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్న ఆయన.. ఎన్నార్సీ కారణంగా మైనారిటీల్లో అభద్రతాభావం ఏర్పడిందని చెప్పారు.’ అతి కీలకమైన అంశాలు, చట్టాలపై తమను విశ్వాసం లోకి తీసుకోవడంలేదని ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలు అసహనంతో ఉన్నాయి.. గతంలో దివంగత ప్రధాని వాజ్ పేయి తమ కూటమిలో 20 పార్టీలను కలుపుకొనివెళ్లారు.. ప్రతి వారినీ గౌరవించేవారు.. అందరినీ సంప్రదించేవారు ‘ అని నరేష్ గుజ్రాల్ గుర్తు చేశారు. తమ రాష్ట్రంలో ఎన్నార్సీని అమలు చేయబోమని బీహార్ సీఎం, జేడీ-యు నేత నితీష్ కుమార్ ప్రకటించిన మరుసటిరోజే నరేష్ గుజ్రాల్ కూడా ఎన్నార్సీకి వ్యతిరేకంగా మాట్లాడడం విశేషం. (ఎన్డీయే మిత్ర పక్షంగా జేడీ-యు కొనసాగుతోందన్న విషయం తెలిసిందే).