AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: మహేష్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట.. ఇద్దరికి గాయాలు

సూపర్‌స్టార్ మహేష్ బాబు షూటింగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లలో భాగంగా ఇవాళ చందానగర్‌లో మహేష్ ఫొటోషూట్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ను చూసేందుకు అక్కడకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడకు చేరుకున్న మహేష్ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు. మరోవైపు అక్కడకు చేరుకున్న అభిమానులు,మహిళలపై మహేష్ బౌన్సర్లు దురుసగా ప్రవర్తించారని ఫ్యాన్స్ ఆగ్రహం […]

బ్రేకింగ్: మహేష్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట.. ఇద్దరికి గాయాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 25, 2019 | 3:00 PM

Share

సూపర్‌స్టార్ మహేష్ బాబు షూటింగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లలో భాగంగా ఇవాళ చందానగర్‌లో మహేష్ ఫొటోషూట్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ను చూసేందుకు అక్కడకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడకు చేరుకున్న మహేష్ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు. మరోవైపు అక్కడకు చేరుకున్న అభిమానులు,మహిళలపై మహేష్ బౌన్సర్లు దురుసగా ప్రవర్తించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు తెరకెక్కింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, సుబ్బరాజు, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో వరుస రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ ఈ మూవీతో హ్యాట్రిక్‌ను కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే వరుసగా నాలుగు హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి, ఈ మూవీతో ఐదో హిట్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే