AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ప్రధాని వాజ్‌పేయికి మోదీ ఘన నివాళి

మాజీ ప్రధాని దివంగత ఎ. బి. వాజ్‌పేయి 95 వ జయంతి సందర్భంగా బుధవారం ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి స్థల్ వద్ద వీరితో బాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత ఎల్. కె. అద్వానీ ప్రభృతులు శ్రధ్ధాంజలి ఘటించారు. ఈ దేశ ప్రజలు వాజ్‌పేయిని ఘనంగా స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నారని మోదీ […]

మాజీ ప్రధాని వాజ్‌పేయికి మోదీ ఘన నివాళి
Anil kumar poka
| Edited By: |

Updated on: Dec 25, 2019 | 5:10 PM

Share

మాజీ ప్రధాని దివంగత ఎ. బి. వాజ్‌పేయి 95 వ జయంతి సందర్భంగా బుధవారం ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి స్థల్ వద్ద వీరితో బాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత ఎల్. కె. అద్వానీ ప్రభృతులు శ్రధ్ధాంజలి ఘటించారు. ఈ దేశ ప్రజలు వాజ్‌పేయిని ఘనంగా స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నారని మోదీ ట్వీట్ చేశారు. వాజ్‌పేయి చేసిన ప్రసంగాల తాలూకు మాంటేజ్‌ని కూడా అయన జత చేశారు. దివంగత ప్రధాని పేరిట మోదీ ప్రభుత్వం వివిధ ప్రజాసంక్షేమ పథకాలను చేబట్టింది. గ్రౌండ్ వాటర్ మేనేజ్‌మెంట్‌ని మెరుగుపరచేందుకు ‘ అటల్ భూజల్ యోజన ‘ పేరిట రూ. 6 వేల కోట్ల పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అలాగే రోహతాంగ్ కనుమ కింద కీలకమైన టన్నెల్ కు వాజ్ పేయి పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.

కృష్ణదేవి, కృష్ణ బిహారీ వాజ్‌పేయి దంపతులకు వాజ్‌పేయి 1924 డిసెంబరు 25 న జన్మించారు. 1939 లో ఆర్ఎస్ఎస్‌లో చేరారు.1942 లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో తన సోదరుడితో సహా ఆయన అరెస్టయ్యారు. ఆ సమయంలోనే భారతీయ జన సంఘ్‌కు నేతృత్వం వహించవలసిందిగా ఆర్‌ఎస్‌ఎస్ ఆయనను కోరింది. 1962 లో 37 ఏళ్ళ వయస్సులో ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. అనంతరం లోక్‌సభ సభ్యుడై ఆ సభకు తొమ్మిది సార్లు ఎన్నికవుతూ వచ్చారు. 1996 లో 13 రోజులు, 1998 లో 13 నెలలు, 1999 నుంచి ఐదేళ్లు ఆయన ప్రధానిగా వ్యవహరించారు.

Follow Us