Rahul Gandhi: ఓట్ల తొలగింపు వెనుక అజ్ఞాత శక్తులున్నాయ్.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం ఓట్లు డిలీట్ చేస్తున్నారు.. ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతో నేను మాట్లాడుతున్నా.. అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేరుతో రాహుల్‌గాంధీ గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేల ఓట్లు తొలగించారని.. ఫేక్ లాగిన్స్, డిజిటల్ ఫామ్స్‌తో ఓట్లు తొలగిస్తున్నారన్నారు.

అంతేకాకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ టార్గెట్‌గా రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల తొలగింపు వెనుక అజ్ఞాత శక్తులు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని సీఈసీ కాపాడుతోందన్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మమ్మల్ని టార్గెట్ చేసి ఓట్లు తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
వ్యవస్థను హైజాక్ చేశారని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అధికారులకు తెలియకుండా ఓటర్ల జాబితా నుంచి.. ఓట్లు ఎలా పోతాయని ప్రశ్నించారు. ఓట్లను తొలగించేందుకు డిజిటల్ ఫామ్స్ వాడారు.. ఓట్ల తొలగింపుపై కర్నాటక సీఐడీ 18 సార్లు అడిగినా.. ఈసీ ఎలాంటి సమాధానం చెప్పడంలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
లైవ్ వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..