Vande Bharat: నరసాపురానికి తొలి వందే భారత్ రైలు..
పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్ఠాత్మకమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మైసూరుకు ఒక ప్రత్యేక రైలును కూడా నరసాపురం నుంచి నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. చెన్నై నుంచి నరసాపురం వరకు ఈ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని మంత్రి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేసి, రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే ప్రకటిస్తుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, నరసాపురం నుంచి మైసూరుకు హైదరాబాద్ మీదుగా నడిచే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా కేంద్రం ఆమోదం లభించింది. ఈ రైలు సెప్టెంబరు 19వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. వారంలో రెండు రోజులు సోమ, శుక్రవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు నరసాపురం నుంచి బయలుదేరి పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి బేగంపేట, వికారాబాద్, రాయచూర్, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, యెలహంక, బెంగళూరు సిటీ మీదుగా మైసూరుకు ప్రయాణిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లీవ్ కావాలని ఎండీకి మెసేస్ పెట్టిన ఎంప్లాయ్.. మరు క్షణంలోనే
చంద్రుడి పైకి మీ బోర్డింగ్ పాస్! అవకాశం మిస్ కాకండి
బాబోయ్.. రోడ్డుపై భారీ పైథాన్… ఆ తర్వాత జరిగిందిదే
భోపాల్ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగ్‌పూర్ ‘బాల్కనీ ఫ్లైఓవర్’
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

