AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోపాల్‌ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగ్‌పూర్‌ ‘బాల్కనీ ఫ్లైఓవర్‌’

భోపాల్‌ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగ్‌పూర్‌ ‘బాల్కనీ ఫ్లైఓవర్‌’

Phani CH
|

Updated on: Sep 16, 2025 | 7:03 PM

Share

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన వింతైన ఫ్లైఓవర్ వార్తల్లో నిలిచింది. దీనిపై వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడేలా దాన్ని నిర్మించారు. విచిత్రమైన ఆకారంలో బ్రిడ్జ్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయింది. బ్రిడ్జ్‌ నిర్మాణానికి స్థలం కొరత కారణంతో ఓ ఇంజనీర్‌ బ్రిడ్జ్‌ను ఎల్‌ ఆకారంలో నిర్మించాడు.

అయితే బ్రిడ్జ్‌ ఎండింగ్‌ 90 డిగ్రీస్‌తో ఉండడంతో ప్రమాదాలు జరగవచ్చని నెటిజన్ల అంటున్నారు. దీంతో బ్రిడ్జ్‌ ప్రారంభానికి ముందే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోనూ అలాంటి అద్భుతాన్నే నిర్మించారు. ఈ తాజా ఇంజినీరింగ్‌ అద్భుతం ఇప్పుడు అందరి దృష్టిని అలరిస్తోంది. నాగ్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్ అశోక్ చౌక్ సమీపంలోని ఒక ఇంటి బాల్కనీ భాగం గుండా వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్థానికులు దీన్ని ఎనిమిదవ అద్భుతం అంటున్నారు. national highway authority, నాగ్‌పూర్ కార్పొరేషన్‌ కలిసి ఒక ఇంటి బాల్కనీ గుండా ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టే ముందు ఎందుకు దానిని గమనించేలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమ కుటుంబం ఆరు తరాలుగా ఆ ఇంట్లో నివసిస్తోందని ఈ బాల్కనీ ఫ్లైఓవర్ గురించి ఇంటి యజమాని ప్రవీణ్ పాత్రే తెలిపారు. ఈ ఆస్తి దాదాపు 150 సంవత్సరాల నాటిదనీ అన్నారు. ఫ్లైఓవర్ తమ బాల్కనీని ఆనుకుంటూ వెళ్లడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, భద్రత గురించి ఆందోళన లేదని అన్నారు. 9 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ను NHAI పర్యవేక్షణలో వెయ్యి కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఈ వివాదంపై అధికారులు మాట్లాడుతూ ఆ ఇల్లు అనధికార నిర్మాణమని, కూల్చివేయడం నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం బాల్కనీకి చేరుకునే ముందుగానే సంబంధింత అధికారులు నోటీసు జారీ చేసి, నిర్మాణాన్ని తొలగించి ఉండాల్సిందని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్షుద్ర పూజలకు విరుగుడు ఉందా? ఆ మంత్రానికి అంత శక్తి ఉందా?

30 పైసలకు పడిపోయిన కిలో ఉల్లి ధర.. రైతు ఆత్మహత్య

మెగా డీఎస్సీ ఎంపిక జాబితా విడుద‌ల‌..

క్షుద్ర పూజలపై ఒక్కటైన గ్రామస్తులు.. ఏం చేశారంటే

TOP 9 ET News: పవన్‌ను ఫ్యాన్సే శత్రువుల చేతిలో పెడుతున్నారా?