మెగా డీఎస్సీ ఎంపిక జాబితా విడుదల..
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ అభ్యర్ధుల నిరీక్షణకు తెరపడింది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదలైంది. మొత్తం 16,347 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా..15,941 మంది అభ్యర్థులు విజయం సాధించారు..మిగిలిన 406 పోస్టులకు ఆయా రిజర్వేషన్లలో అభ్యర్థులు లేక పోవడంతో..వచ్చే డిఎస్సీకి క్యారిఫార్వర్డ్ చేస్తున్నట్లు విద్యా శాఖ కార్యదర్శి కోనా శశిధర్ ప్రకటించారు..డీఎస్సీలో విజయం సాధించిన అభ్యర్ధులకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెప్టెంబరు 19న అమరావతి సచివాలయం సమీపంలో భారీ కార్యక్రమం నిర్వహించి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి 30 వేల మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున వీరంతా విధుల్లో చేరేలా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, జూన్ 6 నుంచి జులై 2 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 దరఖాస్తులు అందాయని ఆయన వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్షుద్ర పూజలపై ఒక్కటైన గ్రామస్తులు.. ఏం చేశారంటే
TOP 9 ET News: పవన్‌ను ఫ్యాన్సే శత్రువుల చేతిలో పెడుతున్నారా?
ఉన్నది వారమే అయినా.. గట్టిగానే సంపాదించిన శ్రష్టి
బంపర్ ఆఫర్ ! ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ! ఏం ప్లాన్ గురూ..!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

