బాబోయ్.. రోడ్డుపై భారీ పైథాన్… ఆ తర్వాత జరిగిందిదే
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. భారీ సైజ్‌లో ఉన్న కొండ చిలువ జనావాసాల్లో హల్‌చల్ చేసింది. దీంతో అందరూ పరుగులు తీశారు. చివరకు స్నేక్ క్యాచర్ దానిని పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజ పల్లి గ్రామం వద్ద భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. దీంతో భయభ్రాంతులైన స్థానికులు పరుగులు తీశారు.
అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. భారీ సైజ్ లో ఉండటంతో అది కదలలేదు. తరువాత.. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు స్నేక్ క్యాచర్ సహకారంతో దానిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంత పెద్ద భారీ కొండచిలువ ప్రజలు నివసించే ప్రాంతానికి రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కొండచిలువ గురించి ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా ఇంతేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంతో ఏం చేయాలో తెలియక హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద వదిలిపెట్టారు. తరువాత అటవీ శాఖ అధికారులు..ఈ కొండ చిలువను. అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భోపాల్ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగ్‌పూర్ ‘బాల్కనీ ఫ్లైఓవర్’
క్షుద్ర పూజలకు విరుగుడు ఉందా? ఆ మంత్రానికి అంత శక్తి ఉందా?
30 పైసలకు పడిపోయిన కిలో ఉల్లి ధర.. రైతు ఆత్మహత్య
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

