చంద్రుడి పైకి మీ బోర్డింగ్ పాస్! అవకాశం మిస్ కాకండి
భూమిని వదిలి వెళ్ళకుండానే చంద్రుని చుట్టూ ప్రయాణించాలనుకుంటున్నారా? అంతరిక్ష పరిశోధనలో పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా.. సామాన్యులనూ భాగస్వాములను చేసేందుకు ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్‌లోగా ప్రారంభం కానున్న ఆర్టెమిస్–2 మిషన్ లో భాగంగా ఓరియన్ అంతరిక్ష పరిశోధన నౌకలో వ్యోమగాములు చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేయనున్నారు.
వారితో పాటు ఓ మెమరీ కార్డు సైతం జాబిల్లిని చుట్టి రానుంది. ఈ మెమరీ కార్డ్‌లో చేర్చడానికి తమ పేర్లను సమర్పించాల్సిందిగా ప్రజలను నాసా ఆహ్వానిస్తోంది. చంద్రుడికో నూలుపోగు మాదిరిగా చంద్రుడి మీదకో ‘పేరు’ అన్నమాట. చరిత్రలో భాగం కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో నాసా కొత్త స్పేస్ లాంచ్ సిస్టమ్, ఓరియన్ అంతరిక్ష నౌక పనితీరును అధ్యయనం చేస్తారు. వ్యోమగాములు భూమి నుంచి 2,30,000 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. తిరుగు ప్రయాణంలో చంద్రుని అవతలి వైపు తిరుగుతారు. ఈ దశాబ్దం చివర్లో చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములను దింపడం, అలాగే మానవులను అంగారక గ్రహానికి పంపాలన్న నాసా ప్రయత్నంలో ఇది ఒక కీలకమైన అడుగు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. రోడ్డుపై భారీ పైథాన్… ఆ తర్వాత జరిగిందిదే
భోపాల్ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగ్‌పూర్ ‘బాల్కనీ ఫ్లైఓవర్’
క్షుద్ర పూజలకు విరుగుడు ఉందా? ఆ మంత్రానికి అంత శక్తి ఉందా?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

