AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani Wedding: ముఖేష్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి.. రాధిక మర్చంట్‌ను పెళ్లి చేసుకోనున్న అనంత్..

రత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ, నితా అంబానీల చిన్న కుమారుడు.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధ వేడుక అంగరంగవైభవంగా జరిగింది.

Anant Ambani Wedding: ముఖేష్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి.. రాధిక మర్చంట్‌ను పెళ్లి చేసుకోనున్న అనంత్..
Anant Ambani Engagement
Shaik Madar Saheb
|

Updated on: Dec 29, 2022 | 3:45 PM

Share

Anant Ambani to wed Radhika Merchant: భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ, నితా అంబానీల చిన్న కుమారుడు.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. రాజస్థాన్‌ నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ వేడుక ఘనంగా జరిగింది. శ్రీనాథ్‌జీ ఆశీస్సులతో ఆలయ పూజారుల సమక్షంలో ఈ యువ జంట నిశ్చితార్థ (రోకా) వేడుక జరిగింది. ముకేష్‌ అంబానీ – వీరేన్ మర్చంట్ కుటుంబాలు ఆలయంలో రోజంతా గడిపారు. సాంప్రదాయ వేడుక రాజ్-భోగ్-శ్రీంగార్ వేడుకల్లో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబం, స్నేహితుల సమక్షంలో అంబానీ ఈ సంతోషకరమైన వేడుకను నిర్వహించారు. అనంత్‌ అంబానీ, రాధిక మార్చంట్‌ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో స్టార్ల నుంచి సామాన్యుల వరకు అందరూ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రాధిక మర్చంట్ – అనంత్ అంబానీ ఒకరికొకరు చాలా సంవత్సరాలుగా తెలుసు. అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్లలో రాధిక చాలాసార్లు కనిపించింది. అదే సమయంలో, త్వరలో ఆమె అంబానీ కుటుంబానికి కోడలు కాబోతోంది. అయితే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించనప్పటికీ.. అంబానీ కుటుంబ సభ్యులు త్వరలోనే పెళ్లిని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Anant Ambani

Anant Ambani

రాధిక మర్చంట్‌ ఎవరంటే..

రాధిక మర్చంట్.. వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె.. విరేన్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ CEO.. ముఖేష్ అంబానీకి చాలా ఏళ్లుగా సన్నిహితుడు. అదే సమయంలో, రాధిక, ఇషా అంబానీ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇరు కుటుంబాలు మంచి సాన్నిహిత్యం ఉంది. అనంత్ అంబానీ లేడీ లవ్ క్లాసికల్ డ్యాన్సర్ కూడా, ఆమె గురు భావ్నా థక్కర్ నుంచి నృత్యం నేర్చుకుంది.

ఇవి కూడా చదవండి

అనంత్ అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి తన చదువును పూర్తి చేశారు. అప్పటి నుంచి జియో ప్లాట్‌ఫారమ్‌, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో సభ్యునిగా సహా వివిధ హోదాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పనిచేశారు. అనంత్‌ అంబానీ ప్రస్తుతం RIL ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి.. బోర్డ్ ఆఫ్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..