Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి.. ఏకగ్రీవంగా ఎన్నికున్న లెజిస్లేచర్ పార్టీ
ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికయ్యారు. ప్రస్తుత సీఎం తీరథ్ సింగ్ రావత్ రాజీనామాతో ఖాళీ అయిన ముఖ్యమంత్రి స్థానానికి పుష్కర్‌సింగ్ సరైన వ్యక్తిగా పార్టీ నిర్ణయించింది.
Uttarakhand CM Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికయ్యారు. ప్రస్తుత సీఎం తీరథ్ సింగ్ రావత్ రాజీనామాతో ఖాళీ అయిన ముఖ్యమంత్రి స్థానానికి పుష్కర్‌సింగ్ సరైన వ్యక్తిగా పార్టీ నిర్ణయించింది. తీరథ్ సింగ్ రావత్ రాజీనామా తర్వాత ఎవరు సీఎం అవుతారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై పార్టీ అధిష్టానం పలుమార్లు పార్టీ నేతలతో చర్చలు జరిపింది. కొద్ది సేపటి క్రితం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ నరేంద్రసింగ్ తోమర్ అధ్వర్యంలో.. ఉత్తరాఖండ్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పుష్కర్ సింగ్ ధామిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ఆయన గతంలో ఘాటిమా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర బీజేపీ యువజన అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
మార్చి 10న ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తీరథ్ సింగ్ రావత్ కేవలం 4నెలలు మాత్రమే సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈమధ్యకాలంలోనే కోవిడ్ సమయంలో కుంభమేళా కోవిడ్ టెస్ట్‌ల స్కామ్‌లో ఆరోపణలు రావడంతో ఆయన శుక్రవారం రాత్రి 11గంటలకు తన రాజీనామా లేఖ గవర్నర్‌కు అందజేశారు. దీంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి పేరును ఖరారు చేసింది.
నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి నరేంద్ర సింగ్ తోమర్ పర్యవేక్షణలో బీజేపీ శాసనసభా పక్షం సమావేశమైంది. ఈ సమావేశం పుష్కర్ సింగ్ ధామీని సీఎంగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా ధామీ మాట్లాడుతూ… ‘‘నాపై అధిష్ఠానం పెద్ద బాధ్యతనే మోపింది. ప్రధాని మోదీకి, ఇతర నేతలకు ధన్యవాదాలు. అందర్నీ కలుపుకొని వెళ్తా. ప్రజా క్షేమం కోసం పనిచేస్తా. మేమిచ్చిన హామీలను నెరవేరుస్తా’’ అని పుష్కర్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు శనివారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Uttarakhand: We’re happy with this decision. We got a young leader. We’ll win going to win 2022 Assembly elections with a better margin: BJP MP Ajay Bhatt after Pushkar Singh Dhami appointed as State BJP legislature party leader pic.twitter.com/LGcyDAgjXc
— ANI (@ANI) July 3, 2021
Read Also… ఛత్తీస్‌గఢ్‌లో యాక్సన్ మొదలు పెట్టిన మావోయిస్టులు.. ఐరన్ ఓర్ ప్లాంట్ కార్మికుల కిడ్నాప్