Breast Milk Bank: నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి.. పంజాబ్‌లో ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు..
Ludhiana Breast Milk Bank: పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా నగరంలో మొట్టమొదటి బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. లుథియానా సివిల్ హాస్పిటల్‌లోని తల్లీపిల్లల ఆసుపత్రి

Ludhiana Breast Milk Bank: పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా నగరంలో మొట్టమొదటి బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. లుథియానా సివిల్ హాస్పిటల్‌లోని తల్లీపిల్లల ఆసుపత్రి ఆవరణలో అధికారులు శుక్రవారం తల్లి పాల బ్యాంకును ప్రారంభించారు. పుట్టిన మొదటి గంటలోనే నవజాత శిశువులకు పాలు అందించేందుకు ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. తద్వారా పిల్లలకు సరైన పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ బ్యాంకు ద్వారా సేకరించిన తల్లిపాలను ఆరోగ్య కార్యకర్తలు నవజాత శిశువులకు పట్టించనున్నారు.
పిల్లలు పుట్టిన మొదటి గంటలోపు చనుబాలివ్వక పోవడం వల్ల తల్లులకు పుండ్లు పడుతున్నాయని.. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. దీంతోపాటు.. పుట్టిన పిల్లలకు గంటలోపు పాలివ్వక పోవడం ద్వారా వారి వృద్ధిలో లోపాలు కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు. తల్లీ పాల బ్యాంకును కౌన్సిలర్ మమతా అషు, ఏడీసీ డెవలప్‌మెంట్ అధికారి అమిత్ కుమార్ పంచల్, అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ హర్జీందర్ సింగ్ బేడీ తదితరులు ప్రారంభించారు.
శిశువులు పుట్టిన వెంటనే తల్లి పాలను ఆరోగ్య కార్యకర్తలు అందిస్తారని జిల్లా యంత్రాంగం తెలిపారు. అయితే.. తల్లిపాలను సంరక్షించడానికి ఒక కంటైనర్ తోపాటు రెండు విద్యుత్ పంపులు, 10 మాన్యువల్ పంపులు, 16 కంటైనర్లు ఒక స్టెరిలైజర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పిల్లలు పుట్టిన మొదటి గంటలోపు నుంచి ఆరు నెలలపాటు తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించవచ్చు.
Also Read: