Punjab polls: జీత్ కే లడ్డు పేరుతో 5 కేజీల లడ్డూలకు భారీ డిమాండ్.. స్వీట్‌ షాపులకు ఆర్డర్ల వెల్లువ..ఎక్కడంటే..

Punjab polls: పండగల్లో, ఫంక్షన్లలో, శుభకార్యాల్లో స్వీట్స్(Sweets) ది ఒక ప్రత్యేక స్థానం. ప్రత్యేకంగా నోరూరించే స్వీట్లను ఫ్యామిలీ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు పంచుతూ తమ సంతోషాన్ని వారితో పంచుకుంటారు..

Punjab polls: జీత్ కే లడ్డు పేరుతో 5 కేజీల లడ్డూలకు భారీ డిమాండ్.. స్వీట్‌ షాపులకు ఆర్డర్ల వెల్లువ..ఎక్కడంటే..
Punjab Polls
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2022 | 3:25 PM

Punjab polls: పండగల్లో, ఫంక్షన్లలో, శుభకార్యాల్లో స్వీట్స్(Sweets) ది ఒక ప్రత్యేక స్థానం. ప్రత్యేకంగా నోరూరించే స్వీట్లను ఫ్యామిలీ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు పంచుతూ తమ సంతోషాన్ని వారితో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా లడ్డులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల (assembly Polls) ఫలితాలు లెక్కింపుకు కేవలం కొన్ని గంటల సమయం ఉండడంతో.. ముఖ్యంగా పంజాబ్(Punjab) లో గెలుపుపై ధీమా ఉన్న అభ్యర్థులు తమ సంతోషన్ని ఇతరులతో పంచుకోవడానికి స్వీట్స్ తో సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసాయి. అన్ని పార్టీలు ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే పంజాబ్ లో ఎన్నికల ఫలితాలకు ముందే అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. విజయం తమదేనని బలంగా నమ్ముతున్న రాజకీయ పార్టీల అభ్యర్థులు.. ఫలితాల తర్వాత విజయ సంబరాలకు ముందే సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే లడ్డూలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. దీంతో స్వీట్ల తయారీ సంస్థలకు చేతి నిండా పని దొరికింది. ప‌లు రాజ‌కీయ పార్టీల నుంచి ల‌డ్డూల కోసం ఆర్డర్లు పోటెత్తాయి. ముఖ్యంగా జీత్ కె లడ్డు పేరుతో ఐదుకేజీల లడ్డుకి భారీగా ఆర్డర్లు వచ్చాయని స్వీట్స్ దుకాణదారులు చెప్పారు. దీంతో క్షణం తీరిక లేకుండా ల‌డ్డూల త‌యారీలో మునిగిపోయారు. భారీ సంఖ్యలో ల‌డ్డూలు త‌యారు చేస్తున్నారు. మామూలుగానే పంజాబీలు లడ్డూలను ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో గెలుపు తర్వాత సంబరాల్లో లడ్డూలను పంచిపెట్టేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో లడ్డూలకు ఆర్డర్లు ఇచ్చారు. స్వీట్ హోమ్ లలో తయారీ ఫొటోలు చూస్తే వారెంత బిజీగా ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు. కాగా.. అన్ని పార్టీలు ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తర‌ప్రదేశ్‌, గోవా, మ‌ణిపూర్, ఉత్తరాఖండ్‌, పంజాబ్ రాష్ట్రాల్లో రాజ‌కీయ అభ్యర్థుల భ‌విత‌వ్యం మార్చి 10న తేలిపోనుంది. ఈ త‌రుణంలో పంజాబ్‌లో ల‌డ్డూల‌కు బాగా గిరాకీ ఏర్పడింది.

Also Read:

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి 160 సీట్లు అంటున్న అచ్చెన్నాయుడు