Crime News: మహారాష్ట్రలో అరాచకం.. మగ బిడ్డ పుడతాడని మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి అత్త,మామలు ఏం చేశారంటే..
సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మూఢనమ్మకాలును ప్రజలు వీడటంలేదు. ఎవరో ఒకరి ప్రభావానికి గురై అరాచకపనులకు శ్రీకారం చుడుతున్నారు. అది తప్పని తెలిసినా.. ఏదైనా సానుకూల ఫలితం వస్తుందనే ఆశతో..
Crime News: సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మూఢనమ్మకాలును ప్రజలు వీడటంలేదు. ఎవరో ఒకరి ప్రభావానికి గురై అరాచకపనులకు శ్రీకారం చుడుతున్నారు. అది తప్పని తెలిసినా.. ఏదైనా సానుకూల ఫలితం వస్తుందనే ఆశతో మూర్ఖత్వపు పనులకు ఒడిగడుతున్నారు. సమాజం ఎంత చైతన్యవంతమవుతున్నా.. స్వలాభం కోసం కొంతమంది ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. ఇలాంటి అనాగరిక ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని పూణేలో ఓ మహిళ చేత దుస్తులు లేకుండా పబ్లిక్ స్నానం చేయించారు ఆమె అత్తమామలు, పబ్లిక్ లో స్నానం చేయిస్తే మగపిల్లాడు పుడతాడని మాంత్రికుడు చెప్పడంతో ఈ అరాచకానికి ఒడిగట్టారు మహిళ అత్తమామలు. 2013లో పుణెకు చెందిన ఓ మహిళలకు 2013లో ఓ వ్యాపారవేత్తతో విహహం జరిగింది. అప్పటినుంచి ఏదో విధంగా ఆమెను భర్తతో పాటు, అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తూనే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భార్య నగలు తాకట్టుపెట్టి రూ.75 లక్షలు రుణం తీసుకున్నాడు ఆమె భర్త. అలాగే పుట్టింటి నుంచి ఆమెకు వచ్చిన ఆస్తులను ఫోర్జరీ సంతకం ద్వారా తీసుకున్నాడు. అలా మోసం చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాడు. ఈమధ్యకాలంలో కొల్హాపూర్ లో క్షుద్రపూజలు చేసే మౌలానా బాబా జమదార్ అనే మాంత్రికుడుని కలిశాడు. వ్యాపారంలో లాభాలు రావాలంటే కొన్ని పూజలు చేయాలంటూ ఆ వ్యాపారితో మాంత్రికుడు చేయించాడు.
మాంత్రికుడి మాటలను నమ్మడం మొదలుపెట్టడంతో.. వ్యాపారికి మగ బిడ్డ పుట్టాలంటే తన భార్యను జలపాతం వద్దకు తీసుకెళ్లి పబ్లిక్ గా స్నానం చేయించాలని చెప్పాడు. మాంత్రికుడి మాటలు విన్న వ్యాపారి విషయాన్ని తన తల్లిదండ్రులుకు చెప్పాడు. దీంతో ఆమహిళను భర్త, అత్తమామలు రాయ్ గఢ్ లోని ఓ జలపాతం వద్దకు తీసుకెళ్లి పబ్లిక్ ముందు స్నానం చేయించారు. ఈవిషయం వెలుగులోకి రావడంతో మహిళ భర్త, అత్తమామలతో పాటు మాంత్రికుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..