Viral: వాయమ్మో! పాఠాలు వినాల్సిన పిల్లాడు ఎంతకు తెగించాడో.. విషయం తెలిస్తే ఫ్యూజులౌట్!
అతడొక 16 ఏళ్ల బాలుడు. స్కూల్‌కు వెళ్లేందుకు ఎప్పుడూ ఏదొక గొడవ చేస్తూ ఉంటాడు..
అతడొక 16 ఏళ్ల బాలుడు. స్కూల్‌కు వెళ్లేందుకు ఎప్పుడూ ఏదొక గొడవ చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఆ పిల్లాడి తిట్టి.. కొట్టి పంపిస్తుంటారు. ఆ బాలుడు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. జైలుకెళ్లాడు.. కట్ చేస్తే.. అక్కడ పోలీసులు ఆ పిల్లాడి మాటలు విని దెబ్బకు షాకయ్యారు. ఇంతకీ అసలు కథేంటంటే..
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే కింద 13 ఏళ్ల విద్యార్ధి నీరజ్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మృతుడి గొంతుకోసి చంపినట్లుగా గుర్తులు ఉండటంతో పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. నీరజ్ సన్నిహితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీరజ్‌కు ఓ ఫ్రెండ్ ఉన్నాడని.. అతడి వయస్సు సుమారు 16 ఏళ్లు ఉంటుందని.. చివరిసారిగా అతడితోనే నీరజ్‌ను చూశామని సన్నిహితులు పోలీసులతో చెప్పారు.
ఆ బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తానే తన స్నేహితుడిని హత్య చేసినట్లుగా అంగీకరించాడు. చదువుకోవాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడిని భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పాడు. ఎవరినైనా చంపి జైలుకు వెళ్తే.. స్కూల్‌కు వెళ్లే బాధ తప్పుతుందనుకున్నానని.. ఈ హత్యకు నెల రోజుల ముందే ప్లాన్ వేశానని తెలిపాడు. జైలులో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తెలుసుకున్నాను. ఆ తర్వాత స్పాట్ నిర్ణయించుకుని.. నీరజ్‌ను అక్కడికి తీసుకెళ్లి .. గొంతుకోసి చంపెశానని వెల్లడించాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..