Dream11 One Crore Winner: డ్రీమ్11లో రూ.కోటిన్నర గెలిచిన పోలీస్.. కట్ చేస్తే అధికారుల నుంచి ఫోన్ కాల్..
రాత్రికిరాత్రే రూ.కోటిన్నర గెలుచుకున్న మహారాష్ట్రకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ సోమ్‌నాథ్ జెండేకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. నిబంధనలకు అతిక్రమణ, పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ విధుల్లో నుంచి సస్పెండ్ చేసింది పోలీస్ శాఖ. అతనిపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విధుల్లో ఉండి.. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగ్‌లో పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు. దీంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన సోమ్‌నాథ్.. రూ.కోటిన్నర గెలుచుకున్నారు. పోలీసులే బెట్టింగ్‌కు పాల్పడడం వల్ల వివాదం చెలరేగింది.

రాత్రికిరాత్రే రూ.కోటిన్నర గెలుచుకున్న మహారాష్ట్రకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సస్పెన్షన్‌కు గురయ్యారు. నిబంధనలకు అతిక్రమణ, పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ విధుల్లో నుంచి తొలగించింది మహారాష్ట్ర పోలీస్ శాఖ. డ్రీమ్-11 ద్వారా కోటీశ్వరుడు కావడం ఆయన ఉద్యోగానికి ఎసరు పెట్టింది. వాస్తవానికి, సబ్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ జెండే డ్రీమ్-11 నుంచి దాదాపు రూ. 1.5 కోట్లు గెలుచుకున్నారు . కానీ ఓ ప్రభుత్వ అధికారిగా ఇప్పుడు ఇలాంటి జూద క్రీడలను అనుమతించి డబ్బులు గెలుచుకోవడం సరైనదేనా అనే విషయమై పోలీస్ శాఖలో చర్చ జరిగింది. ఇది సరైనది కాదంటూ ఉన్నత అధికారులు శాఖాపరమైన విచారణ ఆదేశించారు.
ఈ ఇన్‌స్పెక్టర్ సోమనాథ్ జెండే పూణేలోని పింప్రి-చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో డ్యటీ నిర్వహిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వప్నా గోర్ దీనిపై విచారణ జరుపనున్నారు. చట్టపరమైన, పరిపాలనాపరమైన విషయాలను పరిశీలించిన తర్వాత.. పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ సోమనాథ్ జెండేపై చర్యలు తీసుకుంటామని పింప్రి-చించ్వాడ్ పోలీసులు తెలిపారు. విచారణ ముగిశాక అతనిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ సతీష్ మానె ఆజ్ తక్‌కి తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వప్నా గోర్ దీనిపై విచారణ జరుపనున్నారు.
రూ. 1.5 కోట్లు గెలుచుకున్న సంతోషంలో..
పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్న పింప్రి-చించ్వాడ్ పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ సోమనాథ్ జెండే డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో జెండే కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ ఆనందం ఎంతో సమయం నిలవలేదు. పింప్రి-చించ్వాడ్ పోలీసులు కేవలం కొన్ని గంటల్లోనే తమ విచారణకు ఆదేశించడమే కారణం. అడ్మినిస్ట్రేటివ్, చట్టపరమైన విషయాలపై విచారణ జరిపిన తర్వాత.. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ జెండేపై చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సతీష్ మానే తెలిపారు.
విచారణ తర్వాత అతనిపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయిస్తామని కూడా చెప్పారు. ప్రభుత్వ అధికారి అయినందున ఇలాంటి ఆటలు ఆడేందుకు అనుమతి ఉందా..? లేదా..? అనే దానిపై విచారణ కొనసాగుతోంది.
ఎస్‌ఐపై స్థానిక బీజేపీ నేత హోంమంత్రికి ఫిర్యాదు
పింప్రీ చించ్‌వాడ్‌లోని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ జెండేకు కోటీశ్వరుడయ్యానన్న ఆనందం కొద్దిసేపటికే మిగిలింది. అతను ఆన్‌లైన్ గేమ్ డ్రీమ్ 11 నుండి రూ. 1.5 కోట్లు గెలుచుకున్నాడు. దీని తర్వాత అతను వెలుగులోకి వచ్చాడు. అనే కోణంలో పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఎస్‌ఐ సోమనాథ్ జెండేపై బిజెపి స్థానిక నాయకుడు అమోల్ థోరట్ నేరుగా హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్యూటీ ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా యూనిఫాంలో డబ్బు సంపాదించి.. అదే యూనిఫాంలో మీడియా ముందు కనిపించడం ద్వారా యువతను ఇలాంటి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేలా ప్రోత్సహించాడని థోరట్ ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి