పుదుచ్చేరి ఎటువైపు.. గవర్నర్‌ ముందున్న ఆప్షన్స్‌ ఏంటి..? రాష్ట్రపతి పాలన వైపేనా..!

Puducherry Assembly:పుదుచ్చేరిలో నారాయణస్వామి సర్కార్‌ కుప్పకూలింది. దీంతో బంతి గవర్నర్‌ తమిళి సై కోర్టులోకి వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆమె..

పుదుచ్చేరి ఎటువైపు.. గవర్నర్‌ ముందున్న ఆప్షన్స్‌ ఏంటి..? రాష్ట్రపతి పాలన వైపేనా..!
Puducherry Assembly
Follow us

|

Updated on: Feb 22, 2021 | 10:10 PM

పుదుచ్చేరిలో నారాయణస్వామి సర్కార్‌ కుప్పకూలింది. దీంతో బంతి గవర్నర్‌ తమిళి సై కోర్టులోకి వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఏం చేయబోతున్నారు. .? గవర్నర్‌ ముందున్న ఆప్షన్స్‌ ఏంటి..? ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమిని ఆహ్వానిస్తారా..? లేక అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలనకు సిఫార్స్‌ చేస్తారా..? ఇప్పుడందరి ఫోకస్‌ పుదుచ్చేరి గవర్నర్‌ తమిళి సై పైనే పడింది.

పుదుచ్చేరిలో ఊహించిందే జరిగింది. సీఎం నారాయణస్వామికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సర్కార్ కుప్పకూలిపోయింది. అసెంబ్లీలో బలం నిరూపించుకోలేకపోవడంతో ప్రభుత్వం పడిపోయింది. సంఖ్యా బలం లేక ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్‌ చేసింది నారాయణస్వామి వర్గం. దీంతో సభలో గందరగోళం నెలకొంది. రెండు కూటములకు చెందిన సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సభ నుంచి బయటికొచ్చేశారు నారాయణస్వామి. అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి..గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.

నామినేటెడ్ సభ్యులతో తమ ప్రభుత్వాన్ని పడగొట్టారని ఆరోపించారు నారాయణస్వామి. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు..కావాలనే కుట్ర చేశాయన్నారు. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని సభ్యులు..తమ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో సక్సెసయ్యారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని..త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

ఐతే ప్రజా వ్యతిరేకతతోనే నారాయణస్వామి ప్రభుత్వం పడిపోయిందంటున్నారు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్ కూటమి సభ్యులు. ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా బీజేపీపై విమర్శలు తగదన్నారు. మేం ఎలాంటి కుట్రలు చేయలేదని ప్రకటించారు.

మరోవైపు ప్రతిపక్ష ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమి బలం 14కు చేరడంతో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అవకాశముంది. ఐతే ఇప్పుడు బంతి గవర్నర్‌ కోర్టులో ఉండటంతో తమిళి సై ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే గవర్నర్ తమిళిసై..పుదుచ్చేరిలో తనదైన మార్కును చూపిస్తున్నారు. రాజ్‌భవన్ లో పలువురి ఉద్యోగులపై వేటు వేశారు. దీనికి వెనుక కూడా రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించారు. నంబర్‌గేమ్‌లో నారాయణస్వామి విఫలమవడంతో గవర్నర్‌ నిర్ణయంపైనే పుదుచ్చేరి భవితవ్యం ఆధారపడి ఉంది.

ఇది కూడా చదవండి

Five Vegetables Easy to Grow: ఇంట్లోనే ఈ ఐదింటిని చాలా సులభంగా సాగు చేద్దాం.. ఇవి ఎలా అంటే…